Kapil Sharma: కపిల్ శర్మ కేఫ్ పై ఉగ్రవాదుల కాల్పులు..

బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ పై ఖలిస్తానీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కెనడాలో ఉన్న కేఫ్ పై దాదాపు తొమ్మిది రౌండ్స్ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులకు ఖలిస్తానీ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డి బాధ్యత వహించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ప్రస్తుతం కెనడా అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని.. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం.

Kapil Sharma: కపిల్ శర్మ కేఫ్ పై ఉగ్రవాదుల కాల్పులు..
Kapil Sharma

Updated on: Jul 10, 2025 | 7:15 PM

బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ పై ఖలిస్తానీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కెనడాలో ఉన్న కేఫ్ పై దాదాపు తొమ్మిది రౌండ్స్ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులకు ఖలిస్తానీ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డి బాధ్యత వహించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ప్రస్తుతం కెనడా అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని.. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం.

కాప్స్ కేఫ్ అని పిలువబడే ఈ కేఫ్ ఇటీవలే ప్రారంభించారు. ఈ కేఫ్ బాధ్యతలు కపిల్ శర్మ భార్య గిన్ని చత్రత్ చూసుకుంటున్నారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఉన్న ఈ కేఫ్ కొన్ని రోజుల క్రితం సాఫ్ట్ లాంచ్ అయింది. బుధవారం రాత్రి (కెనడా సమయం) నాటి ఒక వీడియోలో కారులో కూర్చున్న ఒక వ్యక్తి కేఫ్ కిటికీ వైపు వరుసగా కనీసం తొమ్మిది షాట్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పులకు బాధ్యత వహించిన లడ్డి అనే వ్యక్తి ఉగ్రవాద నిరోధక సంస్థ NIA మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకడని.. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధం కలిగి ఉన్నాడని అధికారులు తెలిపారు. గతంలో కపిల్ శర్మ చేసిన కామెంట్లతో మనస్తాపం చెంది కాల్పులు జరిపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కపిల్ కేఫ్ తెరిచి మూడు రోజులు మాత్రమే అయింది. కపిల్, అతని భార్య గిన్ని ఆ కేఫ్ యొక్క అందమైన చిత్రాలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు కపిల్ శర్మ కేఫ్ పై కాల్పులు జరగడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని సమాచారం త్వరలో వెల్లడి అవుతుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..