Marakkar: ఓటీటీలో కాదు.. థియేటర్లలోనే మరక్కర్‌.. విడుదల తేదీని ప్రకటించిన చిత్రబృందం

విడుదలకు ముంచే మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న చిత్రం 'మరక్కర్‌'. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా నటించగా, అర్జున్‌, సుహాసిని కీర్తి సురేశ్‌

Marakkar: ఓటీటీలో కాదు.. థియేటర్లలోనే మరక్కర్‌.. విడుదల తేదీని ప్రకటించిన చిత్రబృందం
Follow us
Basha Shek

|

Updated on: Nov 13, 2021 | 10:25 AM

విడుదలకు ముంచే మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న చిత్రం ‘మరక్కర్‌’. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా నటించగా, అర్జున్‌, సుహాసిని కీర్తి సురేశ్‌, కల్యాణి ప్రియదర్శన్‌, మంజు వారియర్‌, సునీల్‌ శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం గతేడాది మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే కరోనా అడ్డుకుంది. కొవిడ్‌ రెండో ఉద్ధృతి ముగిసిన తర్వాత ఈ ఏడాది ఆగస్టు 12న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేశారు. కానీ పూర్తి స్థాయిలో థియేటర్లకు అనుమతినివ్వక పోవడంతో మరోసారి వాయిదా వేయక తప్పలేదు. ఈ నేపథ్యంలో ‘మరక్కర్‌’ ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలున్నాయంటూ వార్తలొచ్చాయి. అయితే వీటన్నింటిని కొట్టివేస్తూ థియేటర్లలోకే వస్తున్నామంటూ ‘మరక్కర్‌’ చిత్ర బృందం స్పష్టం చేసింది.

ఈ ఏడాది డిసెంబరు 2న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు శుక్రవారం మూవీ యూనిట్‌ ప్రకటించింది. హీరో మోహన్‌లాల్‌ కూడా ట్విట్టర్‌లో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ‘ ఇంతకాలం దాచి ఉంచిన విషయాన్ని బ్రేక్‌ చేస్తున్నాం. స్టన్నింగ్‌ సర్‌ప్రైజింగ్‌తో మీ ముందుకు వస్తున్నాం. ‘మరక్కర్‌’ డిసెంబర్‌ 2న థియేటర్లలో విడుదల కానుంది’ అని రాసుకొచ్చాడు. 15వ శతాబ్దానికి చెందిన నావెల్‌ చీఫ్‌ మహ్మద్‌ అలీ మరక్కర్‌ అలియాస్‌ కుంజాలి మరక్కర్‌ జీవితం ఆధారంగా సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ పీరియాడికల్‌ సినిమా రూపొందింది. విడుదలకు ముందే 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఈచిత్రం ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌, ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌, ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది.

Also read:

Pawan Kalyan: సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో పవన్ నయా ప్రాజెక్ట్.. కానీ కండిషన్స్ అప్లై..

Sai Dharam Tej: యాక్సిడెంట్‌ తర్వాత తొలిసారి కెమెరా ముందుకు సాయితేజ్‌.. (వీడియో)

Bellamkonda Ganesh : బెల్లంకొండ చిన్నబాబు కోసం బాలీవుడ్ హీరోయిన్ కూతురు.. గణేష్ బాబు సినిమాలో హీరోయిన్ ఎవంటే..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు