AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohana Krishna Indraganti: ప్రతి సినిమాకు కొత్తగా కథ చెప్పాలని ప్రయత్నిస్తా : ఇంద్రగంటి మోహనకృష్ణ

హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబోలో వస్తున్న మూడవ సినిమా ఇది

Mohana Krishna Indraganti: ప్రతి సినిమాకు కొత్తగా కథ చెప్పాలని ప్రయత్నిస్తా : ఇంద్రగంటి మోహనకృష్ణ
Mohan Krishna
Rajeev Rayala
|

Updated on: Jan 02, 2022 | 10:21 AM

Share

Aa Ammayi Gurinchi Meeku Cheppali: హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబోలో వస్తున్న మూడవ సినిమా ఇది. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.`ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ…ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా నాకు పర్సనల్ గా చాలా ఇష్టమైన మూవీ. ప్రతి సినిమాకు కొత్తగా కథ చెప్పాలని ప్రయత్నిస్తుంటాను అన్నారు.

ఆ క్రమంలో వచ్చిన రొమాంటిక్ డ్రామా  సినిమానే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. కథలోనే సహజమైన కామెడీ ఉంటుంది. సుధీర్ బాబుతో నాకిది మూడో సినిమా. మా మధ్య అలా వేవ్ లెంగ్త్ కుదిరింది. సుధీర్ బాబు ప్రతిభ గల హీరో. అతనిలోని నటుడిని ఇండస్ట్రీ ఇంకా ఉపయోగించుకోవచ్చు. కృతిశెట్టిని ఉప్పెనలో చూసినప్పుడు ఇంప్రెసివ్‌గా అనిపించింది. శ్యామ్ సింగరాయ్ లోనూ ఆకట్టుకుంది. ఇది కృతి శెట్టి బయోపిక్ కాదు. ఆమెను కొత్తగా చూస్తారు. సుధీర్ బాబు, కృతి వాళ్ల నటనతో సినిమాలో జీవించారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి లైఫ్ ను ఎలా ప్రభావితం చేస్తుంది, అనూహ్యంగా వీళ్లు ఎలా ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమకు ఫ్యామిలీ, సొసైటీ నుంచి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి వాటిని అధిగమించి ఎలా ప్రేమతో పాటువాళ్లు అనుకున్నది సాధించారు అనేది స్థూలంగా ఈ చిత్ర కథ. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ మా సినిమాకు ప్రెజెంటర్ గా ఉండటం అనేది సినిమా బాగుందనే స్టాంప్ వేసినట్లే. మైత్రీ వాళ్లకు థాంక్స్. అలాగే బెంచ్ మార్క్ సంస్థకు శుభారంభం ఇచ్చామనే అనుకుంటున్నాను  అని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: ‘కొత్తగా ఏమైంది.. అనుకున్నదే అయిందిగా’.. ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాపై వైరల్‌ అవుతోన్న మీమ్స్‌ చూశారా.?

Ashok Galla’s Hero : సంక్రాంతి పండక్కి వస్తానంటున్న మహేష్ మేనల్లుడు.. అశోక్ గల్లా “హీరో” రిలీజ్ అప్పుడే..

Sudheer Babu: గ్లిజరిన్ లేకుండా ఏడ్చేయగల హీరోయిన్ ఆమె.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన సుధీర్ బాబు..