AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ కోసం రాసుకున్న కథ.. కానీ విష్ణు కోసం ఇచ్చేశారు.. మోహన్ బాబు కామెంట్స్..

ఈ క్రమంలోనే తాజాగా ఈరోజు విడుదలైన టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ ఐషాట్ గురించి చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న మోహన్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కన్నప్ప’ని ఆ పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే తీశామని అన్నారు మోహన్ బాబు .

Prabhas: ప్రభాస్ కోసం రాసుకున్న కథ.. కానీ విష్ణు కోసం ఇచ్చేశారు.. మోహన్ బాబు కామెంట్స్..
Mohan Babu, Prabhas
Rajitha Chanti
|

Updated on: Jun 14, 2024 | 10:02 PM

Share

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‏తో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు మోహన్ బాబు. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మమ్ముట్టి, ప్రభాస్, కాజల్, నేహాశెట్టి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. అలాగే ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నాడనే వార్తలు తెరపైకి రావడం కన్నప్ప మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీకి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈరోజు విడుదలైన టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ ఐషాట్ గురించి చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న మోహన్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కన్నప్ప’ని ఆ పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే తీశామని అన్నారు మోహన్ బాబు .

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ ఈ సినిమా ఏ తరానికి అయినా కొత్తగానే ఉంటుందని అన్నారు. ధూర్జటి మహాకవి భక్తి భావం ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్యం ఏంటి? అనే విషయాలను ఈ సినిమాలో అద్భుతంగా చూపించామని అన్నారు. ఎంతో వ్యయప్రయాసతో నిర్మించామని.. ఈ సినిమాలో భారత దేశంలోని నాలుగు మూలల ఉన్న మహా నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని తెలిపారు. శరత్ కుమార్ తీసిన పెదరాయుడు సినిమాను తీశాను. ఎలాంటి పాత్రనైనా అవలీలగా శరత్ కుమార్ పోషించగలరని అన్నారు.

ఇది కేవలం భక్తి చిత్రమే కాదుని ఇందులో అన్ని రకాల అంశాలుంటాయని అన్నారు. పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే ఈ సినిమా తీశామని చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమా కోసం ముందుగా కృష్ణంరాజు గారితో మాట్లాడామని.. విష్ణు కోసం కన్నప్ప తీయాలని అనుకుంటున్నానని చెబితే.. ప్రభాస్ కోసం రాసుకున్న కథను కూడా ఇచ్చేశారని తెలిపారు. కన్నప్ప సినిమా కోసం ఇంకా ఎన్నో ఈవెంట్స్ నిర్వహిస్తామని.. కన్నప్ప సినిమాకు అందరి ఆశీస్సులు కావాలన్నారు. మున్ముందు ఇంకా ఎన్నో ఈవెంట్‌లు నిర్వహిస్తాం. నిర్మాతగా నాకు మాత్రమే కాకుండా.. కన్నప్ప టీంకు ప్రజలందరి ఆశీస్సులు కావాలి’ అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.