AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya Krishnan: 30 ఏళ్ల కెరీర్.. రమ్యకృష్ణ ఎంత సంపాదించిందో తెలిస్తే షాకే.. అంత తక్కువా..?

1990 నుంచి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలంపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. చిన్న వయసులోనే నటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఎనిమిదో తరగతి చదువుతూనే వెల్లై మనసులో ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత బాల మిత్రులు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమయ్యింది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, రాజశేఖర్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

Ramya Krishnan: 30 ఏళ్ల కెరీర్.. రమ్యకృష్ణ ఎంత సంపాదించిందో తెలిస్తే షాకే.. అంత తక్కువా..?
Ramyakrishnan
Rajitha Chanti
|

Updated on: Jun 14, 2024 | 9:38 PM

Share

రమ్యకృష్ణ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచేయం అవసరంలేని పేరు. ఇప్పుడున్న సినీ ప్రియులకు ఆమె ఓ శివగామి. కానీ 90’s అడియన్స్ కు కంటిచూపుతోనే భయపెట్టే ఓ నీలాంబరి. నిజమే మరీ.. అందమే కాదు.. కళ్లతోనూ అద్భుతంగా నటించే హీరోయిన్. ఎలాంటి పాత్రకైనా తనదైన నటనతో ప్రాణం పోసే నటి. ఎన్నో సినిమాలు.. మరెన్నో పాత్రలు ఆమెను తెలుగు వారికి దగ్గర చేశాయి. 1967 సెప్టెంబర్ 15న చెన్నైలో జన్మించిన రమ్యకృష్ణ.. 1990 నుంచి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలంపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. చిన్న వయసులోనే నటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఎనిమిదో తరగతి చదువుతూనే వెల్లై మనసులో ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత బాల మిత్రులు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమయ్యింది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, రాజశేఖర్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

హీరోయిన్ గానే కాకుండా విలన్ క్యారెక్టర్స్ కూడా అదరగొట్టింది. రజినీకాంత్, సౌందర్య జంటగా నటించిన నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఈ సినిమా రమ్యకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది. చాలాకాలం పాటు కథానాయికగా నటించిన రమ్యకృష్ణ యంగ్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం తల్లిగా నటిస్తుంది. దాదాపు 30 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతుంది రమ్యకృష్ణ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే.. నివేదికల ప్రకారం రమ్యకృష్ణ నికర విలువ రూ.90 కోట్లు. అలాగే ఇప్పుడున్న నటీమణులలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి కూడా ఆమె. ఒక్కో సినిమాకు రూ.3 నుంచి రూ. 4 కోట్ల వరకు తీసుకుంటారు. అలాగే ఎండార్స్‌మెంట్‌లు, వాణిజ్య ప్రకటన కోసం భారీ మొత్తంలో వసూలు చేస్తారని సమాచరం. సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ సీరియల్స్ ద్వారా బుల్లితెరపై సందడి చేసింది. రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..