OTT: ఓటీటీలో సుస్సు పోయించే దెయ్యం సినిమా – ట్విస్టులే ట్విస్టులు
ది ఫస్ట్ ఒమెన్ కథ విషయానికి వస్తే.. రోమ్‌లోని ఒక చర్చిలో ఒక అమెరికన్ మహిళ పనిలో చేరుతుంది. అక్కడ తన పుట్టుక గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే దుష్ట శక్తులు, దెయ్యాలు వంటివి ఎదురౌతాయి. వాటిని ఎదుర్కొంటూ ట్విస్టులతో కథ సాగుతుంటుంది. హారర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ మూవీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

కరోనా సమయంలో జనాలు ఓటీటీ కంటెంట్‌కు బాగా అలవాటుపడ్డారు. ఆ భాష, ఈ భాష అన్న బ్యారియర్స్ అంటూలేదు. బాగుందని తెలిసిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు అన్నీ చూసేశారు. ఇక థ్రిల్లింగ్, సస్పెన్స్‌తో కూడిన ఇంట్రస్టింగ్ హరర్ సినిమాలను మెజార్టీ ఆడియెన్స్ లైక్ చేస్తారు. అందుకే ప్రేక్షకుల మైండ్‌సెట్స్‌కు తగ్గట్టుగానే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అలాంటి కంటెంట్‌ను తీసుకొస్తున్నాయి. అలానే ఓటీటీలో ‘ది ఫస్ట్ ఒమెన్’ అనే హరర్ మూవీ నెక్ట్స్ లెవల్‌లో రివ్యూలు అందుకుంటుంది. హాలీవుడ్లో ఒమెన్ ఫ్రాంఛైజీకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఫ్రాంఛైజీ నుంచి ఆరో మూవీగా ది ఫస్ట్ ఒమెన్ వచ్చింది. ముందుగా ఏప్రిల్ 4న ఇటలీలో రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అనంతరం ఏప్రిల్ 5న అమెరికాలోనూ విడుదల చేయగా సూపర్ హిట్ అయింది. మే 30 నుంచి మన దగ్గర ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీకి అదిరే రేటింగ్ వస్తుంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ హారర్ సినిమా కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే చూడొచ్చు. కాగా ఈ సినిమాకు బెన్ జాకోబీ కథ అందిచగా… అర్కాషా స్టీవెన్సన్ డైరెక్షన్ చేశారు. తౌఫీక్ బర్హోమ్, టైగర్ ఫ్రీ, రాల్ఫ్ ఇనెసన్, సోనియా బ్రాగా, బిల్ నైఘీ ఇతరులు కీ రోల్స్ పోషించారు. కీత్ థామస్, టిమ్ స్మిత్ స్క్రీన్ ప్లే అందించారు. హారర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ట్రైలర్ దిగువన చూడండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




