Mohan Babu: నేను లేననుకొని నా భార్య పిల్లలపై దాడి చేశారు.. అసలు విషయం బయటపెట్టిన మనోజ్

ఆదివారం జలపల్లి లోని ఇంట్లో గుర్తుతెలియని పదిమంది వ్యక్తులు దాడి చేశారని పహడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. ఫిర్యాదు కాపీలో మంచు మనోజ్ ఇలా పేర్కొన్నారు.

Mohan Babu: నేను లేననుకొని నా భార్య పిల్లలపై దాడి చేశారు.. అసలు విషయం బయటపెట్టిన మనోజ్
Mohan Babu , Manoj
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 09, 2024 | 9:39 PM

మంచు ఫ్యామిలీలో మంటలు రేగుతున్నాయి. మంచు మనోజ్ గాయాలతో ఆసుపత్రిలో చేరడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మంచు కుటుంబ వివాదం మరింత ముదిరిపోతోంది. తాజాగా మంచు మనోజ్ పై మోహన్ బాబు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాచకొండ పోలీష్ కమీషనర్‌కు మోహన్ బాబు లేఖ రాశారు. తనకు మనోజ్ నుంచి ముప్పు ఉందని.. రక్షణ కావాలని మోహన్ బాబు గారు పోలీసులను కోరారు. పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు మంచు మోహన్ బాబు, మనోజ్. తనకు కొడుకునుండి ప్రాణహాని ఉంది అంటూ రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు.

ఇది కూడా చదవండి : Tollywood : 14ఏళ్లకే ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పుడు మూడు నిమిషాల పాటకు రూ. 2కోట్లు అందుకుంటుంది..

ఆదివారం జలపల్లి లోని ఇంట్లో గుర్తుతెలియని పదిమంది వ్యక్తులు దాడి చేశారని పహడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. ఫిర్యాదు కాపీలో మంచు మనోజ్ ఇలా పేర్కొన్నారు. ” నా భార్య పిల్లలపై నేను ఇంట్లో లేని సమయంలో పదిమంది కలిసి దాడికి పాల్పడ్డారు. నిన్న( ఆదివారం) ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిన్న ఉదయం షూటింగ్ కు వెళ్లాల్సి ఉంది. నేను ఇంట్లో లేను అనే సమాచారం తెలుసుకొని నా భార్య పిల్లలపై దాడికి పాల్పడ్డారు అని పేర్కొన్నారు మనోజ్.

ఇది కూడా చదవండి :మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ళ హాట్ ఫేవరేట్.. చూస్తే ప్రేమలోపడిపోవాల్సిందే

కానీ నేను షూటింగ్ రద్దు చేసుకొని అప్పటికే ఇంట్లో ఉన్నాను. దుండగులను పట్టుకునే క్రమంలో నాకు గాయాలు అయ్యాయి. వెంటనే నా భార్యను తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళాను. నిన్న రాత్రి ఇంటికి తిరిగి వెళ్లి చూసేసరికి ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం లేకుండా చేశారు. విజయ్ రెడ్డి, కిరణ్ కలిసి సిసిటీవీ ఫుటేజ్ మాయం చేశారు. విషయాన్ని బయటికి రానివ్వకుండా విజయ్ రెడ్డి అడ్డుపడుతున్నారు. అసాంఘిక శక్తుల నుంచి నా కుటుంబాన్ని రక్షించండి. వారితో నాకు ప్రాణహాని ఉంది అని మనోజ్ తన ఫిర్యాదులో తెలిపారు.

ఇది కూడా చదవండి :కోతి కొమ్మచ్చి ఆడుతున్న ఈ కుర్రాళ్లలో ఓ స్టార్ హీరో ఉన్నాడు.. అమ్మాయిలు వెర్రెక్కిపోతారు అతనంటే.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.