Mike Tyson: పూరీ ‘లైగర్’ కోసం రంగంలోకి దిగుతున్న ది గ్రేట్ బాక్సర్ మైక్ టైసన్..
ఎవరైనా లావుగా ఉన్నా .. కండలతో కనిపించినా " వీడేంట్రా.. మైక్ టైసన్‌లా ఉన్నాడఅని" మనకు తెలియకుండానే అంటుంటాం.
Liger Movie:
ఎవరైనా లావుగా ఉన్నా .. కండలతో కనిపించినా ” వీడేంట్రా.. మైక్ టైసన్‌లా ఉన్నాడని ” మనకు తెలియకుండానే అంటుంటాం. మరి మనకు తెలియకుండానే.. మన నోటి వెంట పేరొచ్చేంతలా ఫేమస్ అయిన మైక్ టైసన్ మన తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు తెలుసా.. అది కూడా ఓ క్రేజీ యంగ్ హీరో పక్కన! ది గ్రేట్ బాక్సర్ మైక్ టైసన్.. తన హీరో.. రీల్ బాక్సర్‌కు ఇన్సిపిరేషన్ గా ఉంటే బాగుంటుందని పూరి.. అనుకున్నట్టు ఉన్నారు. మరి ఇంకే ఇక వెంటనే.. తన ప్రొడ్యూసర్ కరణ్‌తో కలిసి బాక్సర్ మైక్ టైసన్‌ను లైన్లో పెట్టేశారు. తన పాన్ ఇండియా మూవీ “లైగర్” సినిమాలో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చేందుకు ఒప్పించేశారు కూడా. పక్కాగా మూడు నెలల్లో సినిమాను పూర్తి చేసే అలవాటున్న పూరి.. తన అలవాటు మార్చుకుని పాన్ ఇండియా రేంజ్లో చేస్తున్న సినిమా “లైగర్”. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొత్తం బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్లో సాగనుంది.
ఇప్పటికే అందుకోసం ప్రొఫెషనల్ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్న విజయ్.. క్రేజీ మేకోవర్‌తో లైగర్ కోసం విపరీతంగా కష్ట పడుతూ.. టాక్ ఆఫ్‌ది ఇంటర్నెట్‌గా మారారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసిన పూరీ.. ఈ సినిమాలో స్పెషల్ ఎలిమెంట్గా రియల్ బాక్సర్ మైక్ టైసన్ను తీసుకువస్తూ.. లైగర్ కు మరింత అట్రాక్షన్ యాడ్ చేశారు. ఇక ఈ సినిమాను కరణ్ జోహర్, ఛార్మి, పూరి జగన్నాథ్‌లు కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్ గా మారింది.
మరిన్ని ఇక్కడ చదవండి :