Megastar Chiranjeevi : విదేశాలకు వెళ్లనున్న మెగాస్టార్ చిరంజీవి.. కారణం ఇదే

గాడ్ ఫాదర్ హిట్ సరిపోకపోవడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఇప్పుడు వాల్తేరు వీరయ్య పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మెగాస్టార్ నటిస్తున్న ఫుల్ మాస్ మసాలా మూవీ ఇది.

Megastar Chiranjeevi : విదేశాలకు వెళ్లనున్న మెగాస్టార్ చిరంజీవి.. కారణం ఇదే
Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 27, 2022 | 9:48 AM

మెగా స్టార్ చిరంజీవి స్పీడ్ పెంచారు. రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ మెగా ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో లేదనేది టాక్. గాడ్ ఫాదర్ హిట్ సరిపోకపోవడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఇప్పుడు వాల్తేరు వీరయ్య పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మెగాస్టార్ నటిస్తున్న ఫుల్ మాస్ మసాలా మూవీ ఇది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.అలాగే ఇటీవలే ఈ సినిమానుంచి బాస్ సాంగ్ అంటూ మొదటి సింగిల్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భారీ స్థాయిలో వ్యూస్ రాబడుతోంది ఈ మాస్ మసాలా సాంగ్. ఇక ఈ సాంగ్ మిలియన్స్ వ్యూస్ రాబడుతోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ పాటకు మ్యూజిక్ మాత్రమేకాకుండా స్వయంగా లిరిక్స్ కూడా రాశారు.

ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో పూర్తయ్యిందని తెలుస్తోంది. చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా నెక్ట్స్ పార్ట్‌ను విదేశాల్లో చిత్రీక‌రించాల్సి ఉంది. దీంతో ఎంటైర్ యూనిట్ ఫ్రాన్స్‌కు  వెళుతున్నార‌ని స‌మాచారం. చిరంజీవితో స‌హా యూనిట్ స‌భ్యులు అంతా ఫ్రాన్స్ ప‌యనం అవుతున్నార‌ట‌. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వారంలోనే మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్యను రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమాకు భోళాశంకర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో కీర్తిసురేష్ చిరు చెల్లెలిగా కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి