Chiranjeevi: మెగాస్టార్ చెప్పింది ఆ హీరో గురించేనా..? వైరల్ అవుతోన్న చిరు కామెంట్స్
చిరు రాజకీయ పార్టీ పై ప్రెస్ మీట్లు పెట్టి మరీ దుర్భాషలాడారు. ఇక ఇది చూసే.. చిరు ఫ్యాన్స్ ఊగిపోయారు. రాజశేఖర్ జీవిత ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు. అందర్నీ షాకయ్యేలా కూడా చేశారు.
ఇప్పుడంటే కలిసున్నారు.. చిరు వెన్నంటే ఉంటున్నారు కాని.. అప్పట్లో జీవిత రాజశేఖర్ చిరంజీవి పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యేవారు. తమ సినిమాను లాక్కుని మరీ తాను హీరోగా సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టారంటూ చిరుపై ఆరోపణలు చేశారు. చిరు రాజకీయ పార్టీ పై ప్రెస్ మీట్లు పెట్టి మరీ దుర్భాషలాడారు. ఇక ఇది చూసే.. చిరు ఫ్యాన్స్ ఊగిపోయారు. రాజశేఖర్ జీవిత ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు. అందర్నీ షాకయ్యేలా కూడా చేశారు. దీంతో రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరు.. ఆ మరుసటి రోజే రాజశేఖర్ ఇంటికెళ్లి మరీ సారీ చెప్పారు. తన ప్రమేయం లేకుండానే ఈ ఘటన జరిగిందంటూ.. బాధపడ్డారు. మెగా ఫ్యాన్స్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఇదే విషయాన్ని.. మెగాస్టార్ చిరు మరో సారి గుర్తు చేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారి గురించి ఎమోషనల్‌గా మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గా ప్రస్తావించారు. ఈ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
గాడ్ ఫాదర్ సక్సెస్ సందర్భంగా ఓ ప్రమోషనల్ ఇంటర్య్వూలో పాల్గొన్న చిరు.. సినిమా కు సంబంధించిన విషయాలతో పాటు.. తన పై వస్తున్న ఆరోపణలపై కూడా మాట్లాడారు.
“నేను తప్పు చేయను.. చేస్తే ఒప్పుకుంటాను.. నేను రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పినపుడు ఒకతను చేసిన కామెంట్స్ నచ్చక కొందరు దాడి చేసారు.. అప్పుడు నా తప్పు లేదని చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్లి కూర్చున్నాను.. మీ అందరికి గుర్తుండే ఉంటుంది.” అని చెప్పి.. అప్పటి విషయాన్ని మరో సారి గుర్తు చేశారు చిరు. తన మంచి మనసు ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేశారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.