Megastar Chiranjeevi: డైరెక్టర్ చెప్పిందే మేము చేశాము.. ‘ఆచార్య’ ఫెయిల్యూర్ పై చిరు కామెంట్స్..
మలయాళీ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్ గా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.
మెగాస్టార్ చిరంజీవి.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. చాలా కాలం తర్వాత ఫుల్ లెంత్‌లో చరణ్, చిరు కలిసి నటించిన ఈ మూవీ కోసం థియేటర్లకు వెళ్లిన మెగాభిమానులు మాత్రం నిరాశకు గుర్యయారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే బాలేదంటూ ఈ మూవీపై నెట్టింట నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ పై మొదటి సారి మెగాస్టార్ స్పందించారు. ప్రస్తుతం గాడ్ ఫాదర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న చిరు.. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆచార్య ప్లాప్ పై ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చేశారు.
ఈ సినిమా అపజయం తనను ఏమాత్రం బాధించలేదని అన్నారు. తన కెరీర్ ప్రారంభంలో సినిమా విజయం సాధిస్తే ఎంతో సంతోషించేవాడినని.. అలాగే పరాజయం వస్తే బాధపడేవాడినని తెలిపారు. కానీ ఆరోజులు ఇప్పుడు గడిచిపోయాయని.. మొదటి 15 సంవత్సరాల్లోనే అనేక అనుభవాలను ఎదుర్కోన్నానని.. ఆ సమయంలోనే మానసికంగా, శారీరకంగా అన్నింటినీ తట్టుకోవడం తెలుసుకున్నానని చెప్పారు. ఇక నటుడిగా ఎదిగిన తర్వాత సినిమాలు డిజాస్టర్స్ కావడం వలన తాను బాధపడలేదని.. అలాగే విజయాన్ని ఏమాత్రం తలకెక్కించుకోలేదంటూ చెప్పుకొచ్చారు. ఆచార్య పరాజయం అనేది నన్ను బాధించలేదు. ఎందుకంటే మేము డైరెక్టర్ చెప్పినట్లు చేశాము. కానీ ఒక బాధ మాత్రం ఉంది. నేను, చరణ్ మొదటిసారి కలిసి సినిమా చేశాం. అది హిట్ కాలేదు. ఒకవేళ భవిష్యత్తులో చేసినా.. ఇంత జోష్ ఉండకపోవచ్చు. అంతుకు మించి ఎలాంటి బాధలేదు అన్నారు మెగాస్టార్.
ప్రస్తుతం ఆయన గాడ్ ఫాదర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళీ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్ గా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.