AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: ఎల్‏కే అద్వానీకి భారతరత్న.. రాజకీయ నాయకుల స్థాయిని పెంచారు.. చిరంజీవి ట్వీట్ వైరల్..

ఈ తరానికి చెందిన గొప్ప రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరని.. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని.. ప్రధానిగా దేశానికి సేవ చేశారని.. పార్లమెంట్ లో ఆయన అనుభవం ఎన్నటికీ ఆదర్శప్రాయమని.. ఆయన సుధీర్ఘ రాజకీయ జీవితం నుంచి ఎన్నో నేర్చుకోవచ్చని.. జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా అసమాన కృషి చేశారని.. ఆయనకు ఈ పురస్కారం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని.. ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం రావడం..

Megastar Chiranjeevi: ఎల్‏కే అద్వానీకి భారతరత్న.. రాజకీయ నాయకుల స్థాయిని పెంచారు.. చిరంజీవి ట్వీట్ వైరల్..
Lk Advani, Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Feb 03, 2024 | 5:07 PM

Share

బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి భారతరత్నకు ఎంపికైన సంగతి తెలిసిందే. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో ఆయనను గౌరవించింది కేంద్రం. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ తరానికి చెందిన గొప్ప రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరని.. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని.. ప్రధానిగా దేశానికి సేవ చేశారని.. పార్లమెంట్ లో ఆయన అనుభవం ఎన్నటికీ ఆదర్శప్రాయమని.. ఆయన సుధీర్ఘ రాజకీయ జీవితం నుంచి ఎన్నో నేర్చుకోవచ్చని.. జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా అసమాన కృషి చేశారని.. ఆయనకు ఈ పురస్కారం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని.. ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం రావడం.. ఆయన నుంచి నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తానంటూ రాసుకొచ్చారు ప్రధాని మోదీ. ఈ క్రమంలోనే ఎల్కే అద్వానీకి సోషల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అద్వానీ నిస్సందేహంగా భారతరత్నకు అర్హులు అని ట్వీట్ చేశారు.

“భారతరత్న’ నిస్సందేహంగా శ్రీ ఎల్‌కే అద్వానీ గారికికి ఎంతో అర్హమైన గౌరవం. మన దేశం చూసిన అత్యంత విశిష్టమైన రాజనీతిజ్ఞుల్లో ఆయన ఒకరు. స్వాతంత్ర్యానికి పూర్వం, అనేక దశాబ్దాలుగా దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి అమూల్యమైనది. అద్వానీ గారి వంటి దిగ్గజాలు రాజకీయాలు , రాజకీయ నాయకుల స్థాయిని , గౌరవాన్ని పెంచారు. హృదయపూర్వక అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిరు చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఇదిలా ఉంటే.. అద్వానీ పుర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. 1927 నవంబర్ 8న అవిభక్త భారత్ లోని కరాచీలో జన్మించారు. అక్కడే సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. 1941లో తన పద్నాలుగేళ్ల వయసులోనే ఆరెస్సెస్ లో చేరారు. 1947లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కరాజీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. దేశ విభజన తర్వాత ముంబయిలో స్థిరపడ్డారు. రాజస్థాన్ సంఘ్ ప్రచారక్ గా పనిచేశారు. 1970లో డిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. 1976లో గురజాత్ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అద్వానీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.