Acharya: మెగాస్టార్ ‘ఆచార్య’ రిలీజ్ పై కొనసాగుతున్న సస్పెన్స్.. క్లారిటీ వచ్చేది అప్పుడేనా..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది.

Acharya: మెగాస్టార్ 'ఆచార్య' రిలీజ్ పై కొనసాగుతున్న సస్పెన్స్.. క్లారిటీ వచ్చేది అప్పుడేనా..
Acharya


Acharya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్దా పాత్రలో నటిస్తుండగా.. కాజల్ హీరోయిన్‏గా.. పూజా హెగ్డే కీలకపాత్రలో నటిస్తోంది. ఆలాగే చిరుకు జోడీగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచాయి. ఈ సినిమాలో చరణ్- చిరు ఇద్దరు నక్సలైట్లుగా కనిపించనున్నారు. ఇక టీజర్‌లో మెగాస్టార్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు బహుశా గుణపాఠాలు చెప్తాననేమో..’ అంటూ చిరు చెప్పిన డైలాగ్ టీజర్‌‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక ఆచార్యలో రామ్ చరణ్ సిద్ద అనే పాత్రలో కనిపించనున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆమధ్య విడుదలైన ‘లాహే లాహే .. ‘ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మే నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో రూపొందించిన ప్రత్యేకమైన సెట్‌లో చిరు చరణ్ లపై  కొరటాల ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రామ్ చరణ్ పట్టుబడుతున్నారట. అయితే పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేవు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో 100శాతం ఆక్యుపెన్సీ లేదు. అంతే కాకుండా అనువైన సీజన్స్ అన్నీ పెద్ద సినిమాలతో ఆల్రెడీ బుక్ అయిపోయున్నాయి. దాంతో ఆచార్య రిలీజ్ పై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ వారంలో ఏపీ సీఎంతో టాలీవుడ్ ప్రముఖుల భేటీ తర్వాత చిరంజీవి సినిమా రిలీజ్ గురించి ప్రకటక వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో అద్భుతమైన ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ టాలెంటెడ్ హీరోయిన్…

Anushka Shetty : మరో విభిన్న పాత్రలో నటించనున్న అందాల అనుష్క.. ఏ మూవీలో అంటే..

SIIMA Awards 2021: తరలివచ్చిన తారాలోకం.. మహేష్ బాబు సినిమాకు అవార్డుల పంట..

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu