Acharya Movie: “ఆచార్య” నుంచి అదిరిపోయే అప్డేట్.. రామ్ చరణ్ టీజర్ వచ్చేది అప్పుడే..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాకోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాకోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఓటమి అంటూ ఎరగని కొరటాల దర్శకత్వం వహిస్తుండడం, రామ్ చరణ్ తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఏర్పడ్డాయి. సురేఖ్ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతకాలపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల కోసం ఇటు మెగా అభిమానులే కాకుండా యావత్ సినీ ఇండస్ట్రీ సైతం ఎదురు చూస్తోంది. ఇక ఈ సినిమాలో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే్ నటిస్తోన్న విషయం తెలిసిందే.
ఇక ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమాలో చరణ్ సిద్ద అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఈ సినిమాలో చరణ్ నక్సలైట్ గా కనిపించనున్నాడు. ఇక చరణ్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నారు చిత్రయూనిట్. నవంబర్ 28న విడుదల చేయనున్నారు. ఈ మేరకు అదిరిపోయే పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో చరణ్ నక్సలైట్ గెటప్ లో కనిపించగా చిరు ఫేస్ కనపడేలా డిజైన్ చేశారు. ఇక ఆచార్య సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :