Bhola Shankar : అదరగొట్టిన చిరు.. ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశానికి చేర్చిన స్వాగ్ ఆఫ్ భోళా..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుత ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు మెగాస్టార్ హీరో కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుత ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు మెగాస్టార్ హీరో కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తర్వాత ఆయన మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలో ఓ మాస్ మసాలా మూవీ చేస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మరో మాసివ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “భోళా శంకర్”. ఈ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ మేహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా రీసెంట్ ఈ సినిమాలోని ప్రీ లుక్ పోస్టర్ స్వాగ్ ఆఫ్ భోళాను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. స్వాగ్ ఆఫ్ భోళాలో కంప్లీట్ మాస్ లుక్ లో ఉన్న మెగాస్టార్ స్టైలిష్ మేకోవర్ అదిరిపోయింది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కు స్వాగ్ ఆఫ్ భోళా న్యూ ఇయర్ గిఫ్ట్ గా భావించవచ్చు. స్వాగ్ ఆఫ్ భోళాతో పాటు సినిమా థీమ్ మ్యూజిక్ తో విడుదల చేసిన మోషన్ వీడియో కూడా ఆకట్టుకుంటోంది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం స్వాగ్ ఆఫ్ భోళా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సినిమ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు అభిమానులు.
మెగాస్టార్ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ తమన్నా నటిస్తున్న భోళా శంకర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో కీలక షెడ్యూల్ ను ఇటీవలే కంప్లీట్ చేశారు. కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించనుంది. యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. డడ్లీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథా పర్యవేక్షణ సత్యానంద్.. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఏ ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, కిషోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా తమిళ్ లో వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :