Chiranjeevi: టాలీవుడ్ డైరెక్టర్ల తీరుపై మెగాస్టార్ సెటైర్లు.. ఏమన్నారంటే
టాలీవుడ్ డైరెక్టర్లపై మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయ్యారు. వారి తీరుపై సెటైర్లు వేశారు. నటులు డైలాగులు నేర్చుకోవాలా? లేక నటనపై దృష్టి పెట్టాలా? అంటూ ఫైర్ అయ్యారు.

టాలీవుడ్ డైరెక్టర్లపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)సీరియస్ అయ్యారు. వారి తీరుపై సెటైర్లు వేశారు. నటులు డైలాగులు నేర్చుకోవాలా? లేక నటనపై దృష్టి పెట్టాలా? అంటూ ఫైర్ అయ్యారు. ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ టాలీవుడ్ ను టార్గెట్ చేసి కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ లాల్ సింగ్ చడ్డా సినిమాను మెగాస్టార్ చిరంజీవి తెలుగులో సమర్పిస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ లో మెగాస్టార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పలు చర్చలకు దారితీస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కొంతమంది దర్శకులు షూటింగ్ లొకేషన్ లోనే డైలాగులు అప్పటికప్పుడు రాసి వడ్డిస్తున్నారని చిరంజీవి ఆరోపించారు. ఇది నటులకు ఇబ్బందిగా మారుతోందన్నారు మెగాస్టార్.
నటులు డైలాగులు నేర్చుకోవాలా.? లేక నటనపై దృష్టి పెట్టాలా.? అంటూ ఫైర్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. లాల్ సింగ్ చడ్డా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఈ హాట్ కామెంట్స్ చేశారు. డైరెక్టర్ల తీరు కారణంగా కొందరు నటులు ఇబ్బంది పడుతున్నారని చిరంజీవి చెప్పుకొచ్చారు. టాలీవుడ్ డైరెక్టర్లు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు మెగాస్టార్. దర్శకులు, నిర్మాతలను ఉద్దేశించి చిరంజీవి ఈ కామెంట్స్ చేసినట్లు అర్థమవుతోంది. డైరెక్టర్లు తమ తీరు మార్చుకోవాలంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చకు తెరలేపాయి.




