AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: ‘ఆపద్బాంధవుడు’.. మరో ఇద్దరి కుటుంబాల్లో వెలుగులు నింపిన మెగాస్టార్ చిరంజీవి.. ఏం చేశారో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో పాటు ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు సినీ కార్మికుల కుటుంబాలకు తన వంతు ఆర్థిక సాయం చేశారు. తద్వారా రీల్ లైఫ్ లోనే కాదు నిజ జీవితంలోనూ తానూ హీరోనే అని మరోసారి నిరూపించుకున్నారు మెగాస్టార్.

Chiranjeevi: 'ఆపద్బాంధవుడు'.. మరో ఇద్దరి కుటుంబాల్లో వెలుగులు నింపిన మెగాస్టార్ చిరంజీవి.. ఏం చేశారో తెలుసా?
Chiranjeevi
Basha Shek
|

Updated on: Apr 20, 2026 | 4:51 PM

Share

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్‌ కు రూ. 10.5 లక్షలు , అలాగే తన మాజీ మేనేజర్ కుటుంబానికి మరో 9.5 లక్షలు విరాళం గా అందించి తన ఉదార మనస్తత్వాన్ని చాటుకున్నారు. మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ గత కొద్దీ రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు అత్యవసరంగా ఆయనకు గుండె ఆపరేషన్ చెయ్యాలని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తక్షణమే 10.5 లక్షలు శివనాథ్ ఫ్యామిలీకి అందజేశారు. ఆయనతో పాటు తన దగ్గర పని చేసిన మాజీ మేనేజర్ కి కూడా బై పాస్ సర్జరీ అవసరం అవ్వడం తో మరో 9.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. అలా తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ఇద్దరికి ఒక వారంలోనే రూ. 20 లక్షల సహాయం అందించి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు చిరంజీవి. కేవలం సాయ చేయడమే కాదు.. శస్త్ర చికిత్సలకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా చిరంజీవే పర్యవేక్షించారు. తద్వారా వారి కుటుంబ సభ్యుల్లో భరోసా నింపారు. ఇప్పుడు ఈ విషయం  నెట్టింట వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి గొప్పతనంపై సినీ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా ఈ మధ్యనే కొన్ని స్వచ్చంద సేవ సంస్థలకు 10 లక్షల రూపాయిలు విరాళమిచ్చాడు చిరంజీవి. అలాగే తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కి మరో 5 లక్షల రూపాయిల విరాళం అందించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు విశ్వంభర సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు తనకు వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కే.ఎస్.రవీంద్ర (బాబీ) తో మరో సినిమా చేస్తున్నారు చిరంజీవి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ మెగా మూవీని భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది..

ఒక వారంలో రూ. 20 లక్షల ఆర్థిక సాయం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us