Chiranjeevi Konidela: ఆ చిన్నారి చూపిన స్పందన నా హృదయాన్ని తాకింది : మెగాస్టార్ చిరంజీవి

అన్షి అనే చిన్నారి తనను మరింతగా ఇన్స్‌పైర్ చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మెగాస్టార్ చిరంజీవి కరోనా రోగుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

Chiranjeevi Konidela: ఆ చిన్నారి చూపిన స్పందన నా హృదయాన్ని తాకింది : మెగాస్టార్ చిరంజీవి
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 01, 2021 | 10:28 PM

Chiranjeevi Konidela: 

అన్షి అనే చిన్నారి తనను మరింతగా ఇన్స్‌పైర్ చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మెగాస్టార్ చిరంజీవి కరోనా రోగుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు అయ్యాయి. ఎంతో మంది పేదలకు ఆక్సిజన్ బ్యాంకుల సేవలు అందుతున్నాయి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఓ చిన్నారి ఆలోచన మరింత ఇన్స్‌పిరేషన్ ఇచ్చింది. తన పుట్టినరోజు సందర్భంగా తాను దాచుకున్న డబ్బును చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఓ వీడియో ద్వారా తెలియజేశారు.

‘‘పి.శ్రీనివాస్, శ్రీమతి హరిణి గార్ల చిన్నారి పేరు అన్షి ప్రభాల. జూన్ 1న తన బర్త్ డే. తను దాచుకున్న డబ్బుతో పాటు తన ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు అయ్యే ఖర్చు కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తలపెట్టిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల కోసం ఇచ్చింది. ఈ సందర్భంగా తను ఏమంటోందంటే..‘తను చుట్టూ ఉన్న సమాజం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషం, సంబరం అవుతుంది అని’. ఆ చిన్నారి ఆలోచనకు, మంచి మనసుకు, తను వ్యక్త పరుస్తున్న ఈ ప్రేమకు నేను నిజంగా ముగ్ధుడినపోయాను. అన్షి చూపిన స్పందన నా హృదయాన్ని తాకింది. నన్ను మరింత ఇన్స్‌పైర్ చేసింది. తన డ్రీమ్స్ అన్నీ నిజమవ్వాలని నేను విష్ చేస్తున్నా. ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. భగవంతుడు ఈ చిన్నారి చేతుల మీదుగా మా ప్రయత్నానికి చేయూతనిస్తూ తన ఆశీస్సులను అందిస్తున్నాడని నేను భావిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు అన్షి. హ్యాపీ బర్త్ డే. లవ్ యూ డార్లింగ్’’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆ వీడియోలో తెలియజేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi Oxygen Bank: చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ కు చిన్నారి అన్షి లక్ష రూపాయల విరాళం…

మరో గుర్తుండిపోయే ఐకానిక్ రోల్‏లో రామ్ చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ సినిమాలో సరికొత్త లుక్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!