Hitler Movie 25 Years: చిరంజీవి హిట్లర్ సినిమాకు 25 ఏళ్లు.. ఆసక్తికర విషయాలు మీకోసం..
అగ్రకథానాయకుడు చిరంజీవి కెరీర్ ఆరంభంలో ఎన్నో అటుపోట్లను ఎదుర్కోన్నాడు. వరుస పరాజయాలను చవిచూశాడు
అగ్రకథానాయకుడు చిరంజీవి కెరీర్ ఆరంభంలో ఎన్నో అటుపోట్లను ఎదుర్కోన్నాడు. వరుస పరాజయాలను చవిచూశాడు. దీంతో చిరంజీవి కెరీర్ అయిపోయింది అనుకున్నారంతా.. కానీ అలాంటి సమయంలో హిట్లర్ సినిమాతో సెన్సెషన్ క్రియేట్ చేశాడు మెగాస్టార్. మమ్ముట్టి హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం హిట్లర్ మూవీని తెలుగులో రీమేక్ చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. తెలుగులో హిట్లర్ సినిమా రీమేక్ రైట్స్ ను ఎడిటర్ మోహన్ తీసుకున్నారు. అయితే ఈ సినిమా తనకు నచ్చిందని చేయాలనుకుంటున్నాని చిరు స్వయంగా చెప్పడంతో మోహన్ సంతోషించారు. అలా 1997లో జనవరి 4న సంక్రాంతి కానుకగా హిట్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చిరంజీవి.
చిన్నప్పుడు తల్లి చనిపోయి.. తండ్రి జైలుపాలవుతాడు. దీంతో ఏడుగురు చెల్లెళ్లకు అమ్మ, నాన్న అయి వారిని పెంచి పెద్దచేస్తాడు అన్నయ్య. చెల్లెళ్లు వయసు పెరుగుతున్న కొద్ది.. ఎవరి చూపు పడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. చెల్లెల్ల జోలికి వస్తే వారికి చుక్కలు చూపిస్తాడు. దీంతో అందరూ హిట్లర్ అంటూ పిలుస్తారు. రెండవ చెల్లిని తన మేనమామ కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెద్ద చెల్లెలు మాస్టారును వివాహం చేసుకుంటుంది. అలాగే తన తండ్రి చనిపోయిన ఆ తర్వాత అతని దగ్గర ఉన్న ఇద్దరు అమ్మాయిలకు కూడా హిట్లర్ అన్నయ్యగా మారతాడు. దీంతో మిగిలిన తన చెల్లెల్లు అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. చెల్లెల్లు అసహ్యించుకోవడం.. ప్రత్యర్థుల పన్నాగాలు అన్నింటిని ఎదుర్కోంటాడు. చివరకు తప్పు తెలుసుకున్న చెల్లెల్లు తమ అన్నయ్యను క్షమించమని కోరడంతో సినిమా సుఖాంతమవుతుంది. హిట్లర్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి జీవించేశాడు. ఇక చెల్లెళ్ల పాత్రలలో అశ్వినీ,మోహినీ, పద్మశ్రీ,గాయత్రి మీనా కుమారి నటించగా.. రాజేంద్రప్రసాద్, రంభ కీలకపాత్రలలో నటించి మెప్పించారు. ఇందులో చిరంజీవి తండ్రిపాత్రలో నటించిన దాసరి నారాయణ రావు ఉత్తమ నటునిగా నంది అవార్డును అందుకున్నారు.
ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. వేటూరి, సీతారామశాస్త్రి, భువనచంద్ర, చంద్రబోస్ రాసిన పాటలకు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. ఈ సినిమా చిరంజీవికి ఎప్పుడూ ప్రత్యేకమే. వరుస పరాజయాలను అందుకుంటున్న సమయంలో హిట్లర్ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ మూవీ నేటితో 25 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ..చిరంజీవికి సంబంధించిన అరుదైన ఫోటోను షేర్ చేశారు ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా. హిట్లర్ సినిమాకు మోహన్ రాజా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.
ట్వీట్..
#25yearsofHitler ? #Hitler to #Godfather ? pic.twitter.com/I1uU8JBRRj
— Mohan Raja (@jayam_mohanraja) January 3, 2022
Also Read: Pushpa: నెట్టింట్లో బన్నీ మేనియా.. అమెజాన్ ప్రైమ్‌లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ..
Bellamkonda Srinivas: టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న హిందీ ఛత్రపతి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..
Balakrishna: బాలకృష్ణ సినిమాలో విలన్‌గా కన్నడ హీరో.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..
Ram Gopal Varma: అధికారం ఇచ్చింది మా తలపై కూర్చోవడానికి కాదు.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు