Shivakarthikeyan: జాతిరత్నాలు డైరెక్టర్‌తో శివకార్తికేయన్ సినిమా.. ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా..
తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన చేసిన రెమో, వరుణ్ డాక్టర్ సినిమాలు
తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన చేసిన రెమో, వరుణ్ డాక్టర్ సినిమాలు తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శివకార్తికేయన్. ఇప్పుడు ఈ హీరో తెలుగులో నేరుగా సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనుదీప్ కె.వి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు శివకార్తికేయన్. కొత్త సంవత్సరం రోజున ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, శాంతి టాకీస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కూరు రామ్మోహన్ రావు, అరుణ విశ్వ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను తెలుగు, తమిళంలో తెరకెక్కి్స్తుండగా.. మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ డబ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారట. ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న లేటేస్ట్ టాక్ ప్రకారం శివ కార్తికేయన్ తెలుగు సినిమా కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఇప్పటికే తమిళంలో రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ క్రాస్ చేసిన హీరోగా మారిపోయారు శివకార్తికేయన్. ఇక ప్రస్తుతం తెలుగులో సినిమా చేసేందుకు శివకార్తికేయన్ రూ. 30 కోట్లు డిమాండ్ చేశారట. ఇందుకు మేకర్స్ కూడా అంగీకరించినట్లుగా సమాచారం. Sk20 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. లండన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లుగా ఇటీవల విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు మేకర్స్.
Also Read: Pushpa: నెట్టింట్లో బన్నీ మేనియా.. అమెజాన్ ప్రైమ్‌లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ..
Bellamkonda Srinivas: టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న హిందీ ఛత్రపతి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..
Balakrishna: బాలకృష్ణ సినిమాలో విలన్‌గా కన్నడ హీరో.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..
Ram Gopal Varma: అధికారం ఇచ్చింది మా తలపై కూర్చోవడానికి కాదు.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు