Megastar Chiranjeevi: ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..
తారక రామారావుకు నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. మరోవైపు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్తో కలిసి ఉన్న జ్ఞాపకాన్ని షేర్ చేస్తూ ఆయనకు నివాళులర్పించారు. ఆయన సాధించిన ఘనతలు భావితరాలకు ఆదర్శమంటూ కీర్తించారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు ప్రజల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలకృష్ణతోపాటు కుటుంబసభ్యులు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. తారక రామారావుకు నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. మరోవైపు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్తో కలిసి ఉన్న జ్ఞాపకాన్ని షేర్ చేస్తూ ఆయనకు నివాళులర్పించారు. ఆయన సాధించిన ఘనతలు భావితరాలకు ఆదర్శమంటూ కీర్తించారు.
“కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేస్తూ సీనియర్ ఎన్టీఆర్తో ఉన్న ఫోటోను షేర్ చేశారు చిరంజీవి.
కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను.… pic.twitter.com/YFtWPKKW8n
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2024
అలాగే జూనియర్ ఎన్టీఆర్ సైతం తన తాతయ్య గురించి ట్వీట్ చేశారు. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని.. ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను” అంటూ ట్వీట్ చేశారు.
— Jr NTR (@tarak9999) May 28, 2024
ఎన్టీఆర్ అంటే ఒక శక్తి.. తెలుగువారికి ఆయన ఆరాధ్య దేవం అని అన్నారు నందమూరి బాలకృష్ణ. ఈరోజు ఉదంయ ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళులర్పించారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్.. ముందుగా చదువుకే ప్రాధాన్యత ఇచ్చారని.. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టారని అన్నారు. సినీరంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చి ఒకే పంథాలో వెళ్తున్న రాజకీయాలను మార్చి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారని అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి.. అధికారానికి దూరంగా ఉన్న బడుగు, బలహీనవర్గాలకు పదవులు కట్టబెట్టారని.. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




