AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Namitha: విడాకుల రూమర్స్ పై స్పందించిన నమిత.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్..

ఆర్యన్ రాజేశ్ నటించిన సొంతం సినిమాతో హీరోయిన్‏గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. తొలి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న నమితకు అప్పట్లో యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత వెంకటేశ్ నటించినే జెమినీ సినిమాలో కనిపించింది. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించిన నమిత..

Actress Namitha: విడాకుల రూమర్స్ పై స్పందించిన నమిత.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్..
Namitha
Rajitha Chanti
|

Updated on: May 28, 2024 | 1:05 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ నమిత. ఆర్యన్ రాజేశ్ నటించిన సొంతం సినిమాతో హీరోయిన్‏గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. తొలి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న నమితకు అప్పట్లో యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత వెంకటేశ్ నటించినే జెమినీ సినిమాలో కనిపించింది. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించిన నమిత.. ఆ తర్వాత కెరీర్ కాస్త డల్ అయ్యింది. బొద్దుగా మారడంతో ఈ బ్యూటీకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో సెకండ్ హీరోయిన్, స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది నమిత. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన నమితా.. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు.

కెరీర్ స్లో అయిన టైంలోనే 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు 2022లో కవల పిల్లలు జన్మించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నమిత.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఇటీవలే కోలీవుడ్ హీరో విజయ్ దళపతి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తలలో నిలిచింది. ఇక కొన్ని రోజులుగా నమిత వ్యక్తిగత విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. నమిత తన భర్తతో విడిపోతుందని.. త్వరలోనే విడాకులు తీసుకుంటుందని ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలోనే డివోర్స్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.

“నేను, నా భర్త విడిపోతున్నాం.. విడాకులు తీసుకుంటున్నామని వార్తలు వస్తున్నాయి. ఆ రూమర్స్ చూసి నా స్నేహితులు, బంధువులు కాల్ చేసి మమ్మల్ని అడిగారు. కానీ నేను కొద్ది రోజుల క్రితమే నా భర్తతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాను. అయినా ఇలాంటి నిరాధరమైన వార్తలు ఎందుకు వస్తున్నాయనేది తెలియడం లేదు. కొన్నిసార్లు మా డివోర్స్ గురించి వార్తలు రావడం చూసి నేను నా భర్త కూడా నవ్వుకున్నాం. అలాగే అలాంటి రూమర్స్ చూసి మేము బాధపడడం లేదు ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నమిత చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు.. వానాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు.. వానాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే
ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి శుభవార్త
ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి శుభవార్త
సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే
సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే
పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే..
పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే..
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!