Mega 154: మెగాస్టార్ మూవీ మెగా అప్డేట్.. చిరు ఫస్ట్ లుక్ మూల విరాట్ దర్శనం ఆన్ ద వే..
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత జోరు పెంచారు. రీ ఎంట్రీ తర్వాత ఖైదీ 150 సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు చిరు.
Mega 154: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత జోరు పెంచారు. రీ ఎంట్రీ తర్వాత ఖైదీ 150 సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు చిరు. ఆ తర్వాత హిస్టారికల్ మూవీ సైరాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఆచార్య సినిమాతో గుణపాఠాలు చెప్పడానికి రెడీ అయ్యారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈసినిమాలో చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టారు చిరు. వీటిలో మలయాళంలో మంచి విజయం సాధించిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకు తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదాళం సినిమా రీమేక్ భోళాశంకర్ అనే సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాలో చిరుకు చెల్లెలుగా అందాల భామ కీర్తిసురేష్ నటిస్తుంది. ఈ రెండు సినిమాలతర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు మెగాస్టార్. దీపావళి కానుకగా ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ ను అందించారు మేకర్స్ . ఈ సినిమాలో మెగాస్టార్ మాస్ లుక్ లో అదరగొట్టనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రీలుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ అండ్ పూజా కార్యక్రమాలు ఈనెల 6వ తారీకున ఉదయం 11.43 కు లాంచనంగా జరగనున్నాయి. ఇక అదే రోజున ఈ సినిమానుంచి చిరు లుక్ ను కూడా రివీల్ చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.
154మరిన్ని ఇక్కడ చదవండి :