Sarkaru Vaari Paata: మహేష్ ‘సర్కారు వారి పాట’ మూవీకి ఆ సెంటిమెంట్.. అందుకే సినిమా వాయిదాపడిందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చిత్ర యూనిట్ స్పెయిన్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది.

Sarkaru Vaari Paata: మహేష్ 'సర్కారు వారి పాట' మూవీకి ఆ సెంటిమెంట్.. అందుకే సినిమా వాయిదాపడిందా..?
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 04, 2021 | 7:20 PM

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చిత్ర యూనిట్ స్పెయిన్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది. పరుశురామ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన విడుదల విషయంలో అతి పెద్ద అప్డేట్ ఇటీవలే వచ్చింది. ముందుగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు విడుదలను వాయిదా వేశారు. దాంతో అభిమానుల్లో కాస్త నిరాశ కనిపించినప్పటికీ..బ్లాక్ బస్టర్ సినిమా కోసం వెయిట్ చేయడంలో తప్పులేదు అంటూ కాంప్రమైజ్ అవుతున్నారు అభిమానులు.

సర్కారు వారి పాట చిత్రం వచ్చే ఏడాది ఉగాది సందర్బంగా ఏప్రిల్ 1న విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌కు రాబోతోన్నట్టు ప్రకటించిన పెద్ద చిత్రం ఇదే. ఈ సినిమాకు వేసవి సెలవులు కలిసి రానున్నాయి. హాలీడే సమయంలో విడుదలైన మ‌హేష్ బాబు పోకిరి, భరత్ అనే నేను, మహర్షి వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈక్రమంలోనే సర్కారు వారి పాట సినిమాకూడా హాలీడే సమయంలో రిలీజ్ చేసి సక్సెస్ అందుకోవాలని చుస్తున్నారు. ఇప్పటికే రిలీజైన‌ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగ‌వంతం చేయ‌నుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు.  మరి ఈ సినిమాకు రీలీజ్ సెంటిమెంట్ కలిసొస్తుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sooryavanshi: ‘సూర్యవంశీ’లో ఎంఎస్ ధోని.. ఆసక్తి రేకిత్తిస్తోన్న గుల్షన్ గ్రోవర్ సీక్రెట్ పోస్ట్

Kalyan Dev’s Super Machi : లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘సూపర్ మచ్చి’.. ఆకట్టుకుంటున్న టీజర్

Rajinikanth’s Peddanna Review: చెల్లెలి కోసం అన్న పడే ఆరాటం ‘పెద్దన్న’