Waltair Veerayya: బాస్ పార్టీ సాంగ్ పై స్పందించిన మెగాపవర్ స్టార్.. ఏమన్నారంటే
ఈ సినిమాలో చిరు మత్యకారుడిగా కనిపించనున్నారు. అలాగే ఈసినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో వాల్తేరు వీరయ్య పై..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న మాస్ మసాలా సినిమా ఇది. ఏ ఏ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో చిరు మత్యకారుడిగా కనిపించనున్నారు. అలాగే ఈసినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో వాల్తేరు వీరయ్య పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా ఈ సినిమానుంచి బాస్ పార్టీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భారీ స్థాయిలో వ్యూస్ రాబడుతోంది ఈ మాస్ మసాలా సాంగ్. ఇక ఈ సాంగ్ మిలియన్స్ వ్యూస్ రాబడుతోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ పాటకు మ్యూజిక్ మాత్రమేకాకుండా స్వయంగా లిరిక్స్ కూడా రాశారు.
ఇక ఈ సాంగ్ పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. సాంగ్ చాలా ఫ్రెష్ గా ఉందని. దేవీశ్రీ మరోసారి దుమ్మురేపారని కొనియాడారు చరణ్. ఈ సాంగ్ గురించి పోస్ట్ చేస్తూ బాస్ మళ్లీ స్ట్రాంగెస్ట్ జోన్ లోకి వచ్చేశారని ఈ సాంగ్ ఫ్రెష్ అండ్ సూపర్ గా అదిరింది అంటూ చెప్పుకొచ్చారు. దాంతో మెగా అభిమానులు కూడా ఈ సాంగ్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
వాల్తేరు వీరయ్య సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.
Boss @KChiruTweets is back in his STRONGEST zone? Brother @ThisIsDSP #BossParty SUPER fresh & MASS! Adirindhi ?? #WaltairVeerayya
– https://t.co/Tgj645iQXf @RaviTeja_offl @dirbobby @shrutihaasan @UrvashiRautela @MythriOfficial @AzizNakash @Sekharmasteroff @HariPriyaSinger pic.twitter.com/lPEMGai4QQ
— Ram Charan (@AlwaysRamCharan) November 24, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..