Acharya: ‘ఆచార్య’ హిందీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్.. ఏమన్నాడంటే
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య.. ఈ సినిమాకోసం మెగా ఫ్యాన్స్ అంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో నటింస్తుండటంతో మెగా అభిమానుల్లో ఆత్రుత ఎక్కువయింది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య(Acharya).. ఈ సినిమాకోసం మెగా ఫ్యాన్స్ అంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ఈ సినిమాలో నటింస్తుండటంతో మెగా అభిమానుల్లో ఆత్రుత ఎక్కువయింది. ఇప్పటికే ఆచార్య సినిమానుంచి విడుదలైన చిరు చరణ్ పాస్టర్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక రీసెంట్ రిలీజ్ చేసిన భలే భలే బంజారా పాటలో చరణ్, చిరుల డ్యాన్స్ అభిమానులను ఓ రేంజ్ లో ఖుషీ చేస్తున్నాయి. కొరటాల శివ ఎంతో కాన్ఫిడెంట్ గా తెరకెక్కించిన ఆచార్య సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆర్ ఆర్ఆర్ సినిమాతో ఇటీవలే హిట్ కొట్టిన మెగా పవర్ స్టార్. హిందీ ఆడియన్స్ కూడా బాగా దగ్గరయ్యాడు. గతంలో జంజీర్ సినిమా దెబ్బ కొట్టిన ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం చరణ్ మార్కెట్ కు ప్లెస్ అయ్యింది. దాంతో ఇక పై చరణ్ సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే ఈ క్రమంలోనే ఆచార్య సినిమాను కూడా హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమాలు దాదాపు పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అవుతుండటం తో ఆచార్య హిందీ రిలీజ్ పైఆఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనిపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. తాజాగా ఓ ఇంట్రవ్యూలో చరణ్ మాట్లాడుతూ.. ‘ఆచార్య’ హిందీ రిలీజ్ ఉంటుందని స్పష్టం చేశారు. ముందుగా ఆచార్యన హిందీలో రిలీజ్ చేయాలని అనుకోలేదు. కానీ ఆర్ఆర్ఆర్ ఇచ్చిన స్పూర్తితో హిందీలో ఆచార్య సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం.. కాకపోతే మొన్నటివరకు ఆర్ఆర్ఆర్, ఇప్పుడు శంకర్ సినిమాతో బిజీగా ఉండటంతో డబ్బింగ్ కు సంబంధించిన పనులు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. త్వరలోనే ఆచార్య హిందీలో రిలీజ్ చేస్తామని తెలిపారు. బాలీవుడ్ కు చెందిన పెన్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని హిందీ ప్రేక్షకులకు అందించనున్నట్లు తెలుస్తుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :