మెగా మేన‌ల్లుడు పెళ్లికి రెడీ, వీడియోతో హింట్ !

ఈ లాక్‌డౌన్ సీజ‌న్ కాస్తా టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజ‌న్‌గా మారిపోయింది. ఇప్ప‌టికే బ‌డా నిర్మాత దిల్ రాజుతో పాటు యంగ్ హీరోలు నితిన్, నిఖిల్, రానాలు జీవిత భాగ‌స్వాముల‌తో సెటిలైపోయారు.

మెగా మేన‌ల్లుడు పెళ్లికి రెడీ, వీడియోతో హింట్ !
Follow us

|

Updated on: Aug 23, 2020 | 11:48 AM

ఈ లాక్‌డౌన్ సీజ‌న్ కాస్తా టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజ‌న్‌గా మారిపోయింది. ఇప్ప‌టికే బ‌డా నిర్మాత దిల్ రాజుతో పాటు యంగ్ హీరోలు నితిన్, నిఖిల్, రానాలు జీవిత భాగ‌స్వాముల‌తో సెటిలైపోయారు. మెగా ప్రిన్స్ నిహారిక సైతం పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. తాజాగా మెగా మేన‌ల్లుడు సాయి తేజ్ సైతం పెళ్లి వైపు అడుగు వేస్తున్నాడనే సందేశం అందుతోంది. ఇప్ప‌టిక‌వ‌ర‌కు పెళ్లి అంటే పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ లేదు అని చెప్పుకుంటూ వచ్చిన సాయి తేజ్…కొన్ని సార్లు మ‌నం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వ‌చ్చిన‌ప్పుడు మ‌రి అంటూ ఓ వీడియో ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

స‌ద‌రు వీడియోలో సింగిల్ ఆర్మీ అనే వాట్సప్ గ్రూప్ ఉంది. దానికి డిస్‌ప్లే పిక్చ‌ర్‌గా ఆర్ నారాయ‌ణమూర్తి ఫోటో క‌నిపిస్తోంది. అందులో ​ నుంచి ఒక్కొక్క హీరో లెఫ్ట్ అవుతున్నట్లు ఉన్న యానిమేషన్ వీడియో భ‌లే ఫ‌న్నీగా ఉంది. చివర్లో ‘సారీ ప్రభాస్ అన్న’ అంటూ తేజ్ లెఫ్ట్ అయ్యాడు. సోమవారం ఉదయం 10 గంటలకు గుడ్‌న్యూస్ చెబుతా అంటూ వెల్లడించాడు. దీంతో కుర్రాడికి పెళ్లి క‌ళ వ‌చ్చిదంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నాడు. మ‌రికొంద‌రు ‌ఇది త‌న త‌దుప‌రి సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ప్రమోషన్స్​ కదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read More :

వైఎస్‌ఆర్‌ ఆసరా స్కీమ్, రుణాలపై మార్గదర్శకాలు విడుదల

మరో కీలక అనుమతి పొందిన ‘కొవాగ్జిన్’ !

అలెర్ట్ : ఏపీలో మరో 2 రోజుల పాటు వర్షాలు