Gudumba Shankar: పవన్‌తో పనిచేయడం అద్భుతమైన అనుభవం.. గుడుంబా శంకర్‌ రీ రిలీజ్‌పై మీరా జాస్మిన్‌

పవన్‌ బర్త్ డే సందర్భంగా పవర్‌ స్టార్‌ కెరీర్‌లో స్పెషల్‌ మూవీగా నిలిచిన గుడుంబా శంకర్‌ను రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఆగస్టు 31 న ఈ సినిమా థియేటర్లలో  సందడి చేయనున్నట్లు నిర్మాత నాగబాబు ఇదివరకే వెల్లడించారు. కాగా గుడుంబా శంకర్‌ రీరిలీజ్‌ ద్వారా వచ్చిన కలెక్షన్లను కూడా జనసేన పార్టీకి విరాళంగా అందించనున్నట్టు తెలుస్తోంది. ఇక గుడుంబా శంకర్‌ సినిమా విషయానికొస్తే.. వీర శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ..

Gudumba Shankar: పవన్‌తో పనిచేయడం అద్భుతమైన అనుభవం.. గుడుంబా శంకర్‌ రీ రిలీజ్‌పై మీరా జాస్మిన్‌
Gudumba Shankar Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 30, 2023 | 7:48 PM

పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్‌ పుట్టిన రోజు (సెప్టెంబర్‌ 2) వేడుకలకు అభిమానులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల సేవా కార్యక్రమాలు, అన్నదానాలకు పిలుపునిచ్చారు. ఇక పవన్‌ బర్త్ డే సందర్భంగా పవర్‌ స్టార్‌ కెరీర్‌లో స్పెషల్‌ మూవీగా నిలిచిన గుడుంబా శంకర్‌ను రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఆగస్టు 31 న ఈ సినిమా థియేటర్లలో  సందడి చేయనున్నట్లు నిర్మాత నాగబాబు ఇదివరకే వెల్లడించారు. కాగా గుడుంబా శంకర్‌ రీరిలీజ్‌ ద్వారా వచ్చిన కలెక్షన్లను కూడా జనసేన పార్టీకి విరాళంగా అందించనున్నట్టు తెలుస్తోంది. ఇక గుడుంబా శంకర్‌ సినిమా విషయానికొస్తే.. వీర శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్‌ సరసన మీరాజాస్మిన్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా గుడుంబా శంకర్‌ రీ రిలీజ్‌పై మీరా స్పందించింది. ఈ సినిమా తన కెరీర్‌లో వెరీ వెరీ స్పెషల్‌ అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్‌ చేసింది. ‘ అందరికీ నమస్కారం. పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని గుడుంబా శంకర్‌ సినిమాను రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఇది నాకెంతో ప్రత్యేకమైనా సినిమా. పవన్‌ కల్యాణ్‌తో కలిసి పనిచేయడం నాకో అద్భుతమైన అనుభవం. ఈ సినిమా షూటింగ్‌ను మేము చాలా ఎంజాయ్‌ చేశాం. కామెడీ సీన్స్‌, సాంగ్స్‌ షూట్‌ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా రిలీజై 20 ఏళ్లు గడిచాయంటే అసలు నమ్మశక్యంగా లేదు. ఇన్నేళ్ల తర్వాత రీ రిలీజ్‌ రూపంలో మళ్లీ అంతే ప్రేమను అందిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు’ అని విషెస్‌ చెప్పింది మీరా జాస్మిన్‌.

పవన్‌ కు అడ్వాన్స్‌కు బర్త్‌ డే విషెస్‌..

ఈ సందర్భంగా పవన్‌కు ముందుగానే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది మీరా జాస్మిన్‌. అలాగే నిర్మాత నాగబాబు, డైరెక్టర్‌ వీరశంకర్‌, ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులందరికీ ఆల్‌ ది బెస్ట్‌ తెలిపింది. మీరా జాస్మిన్‌ రిలీజ్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు గుడుంబా శంకర్‌ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. కాగా పవన్‌ కల్యాణ్‌ నటించిన జల్సా, ఖుషి, తొలిప్రేమ సినిమాలు థియేటర్లలో రీ రిలీజ్‌ అయ్యాయి. రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించాయి. ఇప్పుడు గుడుంబా శంకర్‌ కూడా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తుందంటున్నారు ఫ్యాన్స్‌.

ఇవి కూడా చదవండి

మీరా జాస్మిన్ రిలీజ్ చేసిన వీడియో

మీరా జాస్మిన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.