Shah Rukh Khan: వైష్ణో దేవీ ఆలయాన్ని సందర్శించిన షారుఖ్ ఖాన్.. జవాన్ రిలీజ్‌కు ముందు అమ్మవారి దీవెనలు
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ‘పఠాన్’ కంటే భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా 'జవాన్' విడుదలకు వారం రోజుల ముందు షారుక్ ఖాన్ జమ్మూకశ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు .
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ‘పఠాన్’ కంటే భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా ‘జవాన్’ విడుదలకు వారం రోజుల ముందు షారుక్ ఖాన్ జమ్మూకశ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు . అది కూడా అర్ధరాత్రి వేళ. భారీ సెక్యూరిటీ మధ్య ఆయన దేవాలయానికి వచ్చారు. వైట్ షర్ట్, బ్లూ జాకెట్ హుడీ వేసుకున్న షారూఖ్.. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్ పెట్టుకున్నారు. ఆయన వెంట పోలీసులు కూడా ఉన్నారు. మొత్తంగా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్ల మధ్య షారుక్ ఖాన్.. వైష్ణో దేవిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా షారుక్ ది ముస్లిం మతం. అయినప్పటికీ, గణేష్ చతుర్థితో సహా అనేక హిందూ పండుగలు అతని ఇంట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. హిందూ దేవుళ్లపై కూడా ఆయనకు అమితమైన భక్తి ఉంది. తాజాగా హిందువులకు ఎంతో పవిత్రమైన వైష్ణో దేవిని ఆలయాన్ని సందర్శించాడు షారుక్.
గతంలోనూ..
కాగా షారుక్ ఖాన్ వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి కాదు. ‘పఠాన్’ సినిమా విడుదలకు ముందు ఆయన ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ‘జవాన్’ విడుదలకు ముందే మరోసారి వైష్ణో దేవీ మాత దీవెనలు అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్లు, ఫాలోవర్లు షారుక్‌ను ప్రశంసిస్తున్నారు. షారుక్‌కు హిందూ దేవుళ్లపై అమితమైన నమ్మకం, విశ్వాసం ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
బూర్జ్ ఖలిఫాపై జవాన్ ట్రైలర్..
కాగా షారుక్ ‘జవాన్’ కూడా సినిమాను బాగా ప్రమోట్ చేసుకుంటున్నాడు.. భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా ఆయనకు అభిమానులున్నారు. అందుకే ఆగస్టు 31న షారూఖ్ దుబాయ్ వెళ్లనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై జవాన్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. తద్వారా విదేశాల్లోని తన అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇటీవల విడుదలైన జవాన్ ప్రివ్యూ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. ట్రైలర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘జవాన్’ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో హిట్ చిత్రాలను అందించిన ఆయన హిందీలో చేయడం ఇదే తొలిసారి. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో షారుఖ్‌కు జోడీగా కనిపించింది. విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె తదితరులు ఈ చిత్రంలో నటించారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
విస్తృతంగా జవాన్ ప్రమోషన్లు..
Fans relishing the energy exuded by Jawan, our beloved King Khan💥🔥#Jawan #JawanInChennai #JawanPreRelease #JawanPreReleaseEvent #ShahRukhKhan pic.twitter.com/0ARiXViAvq
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) August 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.