AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: ఒకప్పుడు నటించి.. ఇప్పుడు బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్.. ఎవరంటే..?

ప్రస్తుతం వరుస హిట్లతో కెరీర్​లో పీక్​ స్టేజ్​లో ఉన్న బాలయ్యకు ఓ హీరోయిన్ నో చెప్పిందట. ఆమె ఒకప్పుడు బాలయ్య సరసన నటించిన కథానాయికే. మరి ఎందుకు నో చెప్పింది. సీనియర్ హీరోలతో వద్దు అనుకుందా..? లేదా ఆమెని ఎవరైనా మిస్ గైడ్ చేశారా..? తెలుసుకుందాం పదండి...

Balakrishna: ఒకప్పుడు నటించి.. ఇప్పుడు బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్.. ఎవరంటే..?
Balakrishna
Ram Naramaneni
|

Updated on: Mar 10, 2024 | 6:31 PM

Share

నందమూరి నటసింహం బాలయ్య.. ఆరు పదుల వయసులోనూ దుమ్ములేపుతున్నారు. కెరీర్ పరంగా ఆయనకు ఇది బెస్ట్ ఫేజ్ అని చెప్పాలి. ఓ వైపు హీరోగా సాగిపోతూనే మరోవైపు బుల్లితెర హోస్ట్‌గా అదరగొడుతూ అన్‌స్టాఫబుల్ అంటున్నారు.  కుర్ర హీరోలకు మించిన యాక్షన్‌ సీక్వెన్సులు చేస్తూ వారెవ్వా అనిపిస్తున్నారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో బ్యాక్ బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య ప్రజంట్.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే పుల్​ ఫామ్​లో ఉన్న బాలయ్య బాబు చిత్రంలో నటించేందుకు ఓ సీనియర్ హీరోయిన్ నో చెప్పిందన్న టాక్ నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో నటసింహకే కుదరదని చెప్పిన ఆ బ్యూటీ ఎవరా అని తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.

ఒకప్పుడు టాలీవుడ్​లో హోమ్లీ బ్యూటీగా  పేరు తెచ్చుకుంది మీరా జాస్మిన్. అమాయకత్వంతో కూడిన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. రవితేజ, పవన్ కళ్యాణ్, బాలకృస్ణ వంటి స్టార్ హీరోల పక్కన ఆడిపాడింది. అమ్మడి ఖాతాలో మాంచి హిట్స్ ఉన్నాయి. ఇతర భాషల్లోనూ స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు రీ ఎంట్రీ కోసం అందాలు ఆరబోస్తూ ఫోటోలు రిలీజ్ చేస్తుంది. అయితే ఎందుకో, ఏమో తెలీదు కానీ తెలుగులో ఇద్దరు సీనియర్ హీరోలతో నటించేందకు ఆమె నో చెప్పిందట. వెంకీ నారప్పలో నటించే అవకాశం వచ్చినా రిజెక్ట్ చేసిందట. అలానే.. బాలయ్య వీర సింహా రెడ్డిలో చాన్స్ వచ్చినా నో చెప్పిందట. ఒకప్పుడు యాక్ట్ చేసిన బాలయ్యతో ఇప్పుడు ఎందుకు నో చెప్పిందని చర్చించుకుంటున్నారు నెటిజన్స్.

ఇకపోతే ఇటీవలే మీరా జాస్మిన్​ విమానం అనే మూవీలో కీ రోల్ పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో పాటే మాధవన్, సిద్ధార్థ్, నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న టెస్ట్ మూవీలోనూ నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.