Mahesh Babu: ఆ సినిమాకు ముందే మహేశ్ బాబు హాలీవుడ్ రేంజ్ యాక్షన్.. ప్రిన్స్ యాక్టింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రాజమౌళి సినిమా అంటేనే ఏళ్లకు ఏళ్లు పడుతుంది. అందుకే మహేశ్ ఈ విషయాన్ని ద్రుష్టిలో పెట్టుకొని చాలా తెలివిగా ముందుకెళ్తున్నాడు. జక్కన్న సినిమాకు ముందే హాలీవుడ్ యాక్షన్ ఎలా ఉంటుందో చూపెట్టేశాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రాజమౌళి సినిమా అంటేనే ఏళ్లకు ఏళ్లు పడుతుంది. అందుకే మహేశ్ ఈ విషయాన్ని ద్రుష్టిలో పెట్టుకొని చాలా తెలివిగా ముందుకెళ్తున్నాడు. జక్కన్న సినిమాకు ముందే హాలీవుడ్ యాక్షన్ ఎలా ఉంటుందో చూపెట్టేశాడు. అయితే రాజమౌళి తదుపరి చిత్రం కోసం తన అభిమానులను ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ అంచనాలు పెరిగిపోతుంటే మహేష్ తన సమయాన్ని యాడ్స్, అదిరిపోయే ఫోటోషూట్లలో పాల్గొంటూ తన ఫాలోవర్స్ కి ఇన్ స్టాగ్రామ్ లో తన లేటెస్ట్ యాక్టివిటీస్ తో ట్రీట్ చేస్తున్నాడు.
ఫుల్ స్క్రీన్ ‘మౌంటెన్ డ్యూ’ కూల్ డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తన పాత్రలో భాగంగా హాలీవుడ్ స్థాయి యాక్షన్ ను పెంచే కొత్త యాడ్ వీడియోలో మహేష్ నటించాడు. ఈ యాడ్ లో థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో దుమ్మురేపడమే కాకుండా కాకుండా మహేష్ ఆకట్టుకునే లుక్ ను హైలైట్ చేసి ఫ్యాన్స్ ను ఓరేంజ్ లో ఎంటర్ టైన్ చేశాడు.
కె.ఎల్.నారాయణ, ఎస్.గోపాల్ రెడ్డి నిర్మిస్తున్న ఎస్.ఎస్.ఎం.బి.29 చుట్టూ ఎప్పట్నుంచే బజ్ ఉంది. అమెజాన్ అడవి నేపథ్యంలో ఇండియానా జోన్స్ సాహస శైలికి పోలికలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాలని రాజమౌళి లక్ష్యంగా పెట్టుకున్నారు. మేలో గ్రాండ్ లాంచ్ చేయాలని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ ముఖ్య అతిథిగా వచ్చే అవకాశం ఉందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అయితే జక్కనతో చేయబోయే మూవీ కూడా బాహుబలి మాదిరిగా రెండు పార్టులుగా తెరకెక్కే అవకాశం ఉండటంతో మహేశ్ అభిమానులు ఫుల్ ఫిదా అవుతున్నారు.
View this post on Instagram



