Mechanic Rocky Review: మెకానిక్ రాకీ రివ్యూ.. విశ్వక్ సేన్ హిట్టు కొట్టాడా..?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటేస్ట్ చిత్రం మెకానిక్ రాకీ. ఈ ఏడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చిన విశ్వక్.. ఇప్పుడు మెకానిక్ రాకీ మూవీతో అలరించేందుకు రెడీ అయ్యారు. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది.

Mechanic Rocky Review: మెకానిక్ రాకీ రివ్యూ.. విశ్వక్ సేన్ హిట్టు కొట్టాడా..?
Mechanic Rocky Review
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Rajitha Chanti

Updated on: Nov 22, 2024 | 1:36 PM

సోషల్‌ మీడియా పెరిగాక, ప్రతి ఒక్కరి చేతికీ సెల్‌ఫోన్‌ వచ్చాక.. నిత్యం ఎన్నో ప్రకటనలు. వాటిలో వేటిని నమ్మాలో, వేటిని విడిచిపెట్టాలో, దేని పర్యవసానం ఏంటో అర్థం చేసుకోలేక సామాన్యులు తికమకపడే పరిస్థితి. అలాంటి ఓ విషయాన్ని స్పృశిస్తూ డీల్‌ చేసిన సినిమా మెకానిక్‌ రాకీ. ప్రమోషన్లలో విశ్వక్సేన్‌ మరింత కాన్ఫిడెంట్‌గా కనిపించారు. శుక్రవారం రిలీజ్‌ అయిన ఈ సినిమా ఎలా ఉంది? రేపటి నుంచి ఆయన చొక్కా విప్పుకుని తిరగాలా? లేకుంటే.. కాలర్‌ ఎగరేసుకునేలాగే ఉందా? కమాన్‌ లెట్స్ వాచ్‌..

సినిమా: మెకానిక్‌ రాకీ

నటీనటులు: విశ్వక్సేన్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, మీనాక్షి చౌదరి, హర్ష, నరేష్‌, హర్షవర్ధన్‌, విశ్వదేవ్‌ రాచకొండ, సునీల్‌ తదితరులు

రచన – దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి

నిర్మాత: రజనీ తాళ్లూరి

కెమెరా: మనోజ్‌ రెడ్డి కాటసాని

సంగీతం: జేక్స్ బిజోయ్‌

ఎడిటింగ్‌: అన్వర్‌ అలీ

విడుదల: నవంబర్‌ 22, 2024

కథ

రాకేష్‌ నగుమోము అలియాస్‌ రాకీ (విశ్వక్సేన్‌) బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్ చదివి.. సివిల్‌ ఇంజనీర్‌గా కెరీర్‌ చూసుకుందామనుకునే బాపతు. చదువు అబ్బలేదని అర్థమయ్యి తన తండ్రి రామకృష్ణ నగుమోము (నరేష్‌ వీకే) కార్‌ గేరేజ్‌లోనే మెకానిక్‌గా సెటిల్‌ అవుతాడు. ఓ వైపు మెకానిక్‌గా ప్రూవ్‌ చేసుకుంటూ ఇంకో వైపు డ్రైవింగ్‌ కూడా నేర్పిస్తుంటాడు. వారి ఆర్‌.కె. కార్‌ గ్యారేజ్‌ మీద ఎప్పటి నుంచో స్థానిక పెద్దల కన్ను ఉంటుంది. రంకి రెడ్డి (సునీల్‌) మనుషులు ఎంత బెదిరించినా తన గ్యారేజ్‌ని విక్రయించడానికి ఇష్టపడడు రామకృష్ణ. ఇది జరుగుతున్నప్పుడే రాకీ దగ్గర డ్రైవింగ్‌ నేర్చుకోవడానికి ఇద్దరమ్మాయిలు వస్తారు. వారిలో ఒకరు మాయ (శ్రద్ధ శ్రీనాథ్‌). ఇంకొకరు ప్రియ (మీనాక్షి చౌదరి). శ్రద్ధ ఎన్ఐసీ ఇన్‌స్యూరెన్స్ లో పనిచేస్తుంటారు. ప్రియ ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటారు. తన ఫ్రెండ్‌ శేఖర్‌ (విశ్వదేవ్‌) చెల్లెలుగా, తన కాలేజ్‌ మేట్‌గా ప్రియతో ఆల్రెడీ పరిచయం ఉంటుంది రాకీకి. ఇక్కడ దాకా అంతా సవ్యంగా సాగిన కథ రామకృష్ణ చనిపోవడంతో రకరకాల ట్విస్టులు తీసుకుంటుంది. ట్విస్టులేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. శేఖర్‌కీ, ప్రియకీ మధ్య జరిగిన గొడవ, రాకీకి రంకి రెడ్డికి మధ్య జరిగిన డీల్‌, రాకీకి మాయ చేసిన సాయం.. ఆమెకు తోడుగా నిలబడిన మేనేజర్‌, వీరిద్దరినీ బెదిరించిన పోలీస్‌… ఇలా చాలా కేరక్టర్ల గురించి అర్థం చేసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

మెకానిక్‌ రాకీ కథను రవితేజ ముళ్లపూడి చక్కగా రాసుకున్నారు. నిత్యం జనాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావిస్తూ, వాటి చుట్టూ కథ అల్లుకున్నారు. విశ్వక్సేన్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, మీనాక్షి చౌదరి, సునీల్‌, నరేష్‌, విశ్వదేవ్‌.. ఎవరి పాత్రకు వాళ్లు చక్కగా న్యాయం చేశారు. కాకపోతే ఈ తరహా కథలు మనకి కొత్త కాదు. ఆల్రెడీ డబ్బింగ్‌ రూపంలోనూ, ఇంకో రకంగానూ చూసినవే. అలాంటప్పుడు ఆడియన్స్ ని ఫస్ట్ నుంచే ఈ కంటెంట్‌కి అలవాటు చేసుంటే బావుండేది. సినిమా స్టార్ట్ అయిన చాలా సేపు వరకు ఇదేదో లవ్‌స్టోరీ అన్న ఫీలింగ్‌ కలుగుతుంది. సరదా సరదాగా సాగుతున్నట్టే ఉంటుంది. ఫస్టాఫ్‌ మొత్తం అవుతున్నా… స్క్రీన్‌ మీద పెద్దగా కథ కదిలిన దాఖలాలు కనిపించవు. ఉన్న సస్పెన్స్ లు అన్నిటినీ సెకండ్‌ హాఫ్‌లో పెట్టేశారు డైరక్టర్‌. ఫస్టాఫ్‌ నుంచే వాటికి పర్ఫెక్ట్ రూట్‌ వేసుకుంటే ఇంకాస్త ఎంగేజింగ్‌గా తెరకెక్కించగలిగేవారు. సినిమాలో నిర్మాణ విలువలు బావున్నాయి. కెమెరాపనితీరు బావుంది. జేక్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కథని ఎంగేజింగ్‌గా అనిపించింది. సెకండ్‌ హాఫ్‌లో నటీనటుల పెర్ఫార్మెన్స్ అంత బాగా ఎలివేట్‌ కావడానికి జేక్స్ ఆర్‌ ఆర్‌ హెల్ప్ అయింది. స్క్రీన్‌ ప్లే కాస్త మారి ఉంటే, ఎడిటింగ్‌కి కూడా మంచి మార్కులే పడేవి. స్క్రీన్‌ ప్లే కారణంగా ఫస్టాఫ్లో ఎడిటింగ్‌కి కూడా మైనస్‌ మార్కులే పడతాయి. ఆల్రెడీ ఇలాంటి కంటెంట్‌ని చూసినా, ఫస్టాఫ్‌ కాస్త అటూ ఇటూగా అనిపించినా, సెకండ్‌ హాఫ్‌ మాత్రం థ్రిల్‌ కలిగిస్తుంది. సినిమాకు డీసెంట్‌ టాక్‌ తెచ్చిపెడుతుంది.

చివరిగా… సామాన్యుడి సమస్యను స్పృశించిన మెకానిక్‌ రాకీని థియేటర్లలో ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సామాజిక సమస్యను ప్రస్తావించిన 'మెకానిక్‌ రాకీ'
సామాజిక సమస్యను ప్రస్తావించిన 'మెకానిక్‌ రాకీ'
నేను ఇంకా సింగిలే అనుకుంటున్నారా.? రౌడీ హీరో నయా స్టేట్‌మెంట్‌.!
నేను ఇంకా సింగిలే అనుకుంటున్నారా.? రౌడీ హీరో నయా స్టేట్‌మెంట్‌.!
స్కూల్‌ నుంచి ఇద్దరు బాలికలు మిస్సింగ్‌.. లొకేషన్‌ ట్రాక్‌ చేయగా.
స్కూల్‌ నుంచి ఇద్దరు బాలికలు మిస్సింగ్‌.. లొకేషన్‌ ట్రాక్‌ చేయగా.
రోజుకో యాపిల్.. ఇలా తింటే రెట్టింపు లాభాలు.. తెలిస్తే ఇక వదలరు
రోజుకో యాపిల్.. ఇలా తింటే రెట్టింపు లాభాలు.. తెలిస్తే ఇక వదలరు
మత్తెక్కించే ఫోజులతో తమన్నా..
మత్తెక్కించే ఫోజులతో తమన్నా..
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
ప్యాన్‌ ఇండియా ఆడియన్స్ కోసం కొత్త వ్యూహాలు.. ఈవెంట్స్‎తో మార్క్.
ప్యాన్‌ ఇండియా ఆడియన్స్ కోసం కొత్త వ్యూహాలు.. ఈవెంట్స్‎తో మార్క్.
హిట్ కోసమే వెయిట్ చేస్తున్న నాగ చైతన్య! తండేల్‌ మ్యూజిక్ స్టార్ట్
హిట్ కోసమే వెయిట్ చేస్తున్న నాగ చైతన్య! తండేల్‌ మ్యూజిక్ స్టార్ట్
ఇప్పుడు వెండి కొంటే రేపు బంగారం అవుతుంది.. దీనికి AI కూడా కారణమే
ఇప్పుడు వెండి కొంటే రేపు బంగారం అవుతుంది.. దీనికి AI కూడా కారణమే
జియోలో తక్కువ ధరల్లో 336 రోజుల ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియోలో తక్కువ ధరల్లో 336 రోజుల ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!