AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja: కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టనున్న మాస్ మహారాజా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

తాజాగా ఓ సీనియర్ హీరో కూడా ఇప్పుడు బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారని తెలుస్తుంది.  మాస్ మహారాజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రవితేజకు ప్రొడక్షన్ హౌస్ ఉన్న విషయం తెలిసిందే.  ఈ బ్యానర్ లో కొన్ని సినిమాలు కూడా నిర్మించారు రవితేజ. ఇక ఇప్పుడు మరో బిజినెస్ లోకి అడుగు పెడుతున్నారట మన మాస్ మహారాజ.

Ravi Teja: కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టనున్న మాస్ మహారాజా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
Raviteja
Rajeev Rayala
|

Updated on: Feb 22, 2024 | 9:44 AM

Share

చాలా మంది హీరోలు.. సినిమాలతో పాటు ఇతర వ్యాపారాల్లోనూ అడుగులు పెడుతూ ఉంటారు. ఇప్పటికే  మన హీరోలు చాలా మంది రకరకాల బిజినెస్ లలో బిజీబిజీగా గడుపుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు థియేటర్స్ బిజినెస్ లో ఉన్నారు. అలాగే మరోకొంతమంది హీరోలు కూడా రకరకాల బిజినస్ చేస్తున్నారు. ఇక హీరోయిన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ సీనియర్ హీరో కూడా ఇప్పుడు బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారని తెలుస్తుంది.  మాస్ మహారాజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రవితేజకు ప్రొడక్షన్ హౌస్ ఉన్న విషయం తెలిసిందే.  ఈ బ్యానర్ లో కొన్ని సినిమాలు కూడా నిర్మించారు రవితేజ. ఇక ఇప్పుడు మరో బిజినెస్ లోకి అడుగు పెడుతున్నారట మన మాస్ మహారాజ.

రవితేజ కూడా హైదరాబాద్ లో మల్టీ ప్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నారని తెలుస్తోంది. ఏషియన్ గ్రూప్ తో కలిసి రవితేజ థియేటర్స్ ను ఏర్పడట చేయనున్నారని టాక్ వినిపిస్తుంది, హైదరాబాద్ లోని దిల్ షుక్ నగర్ లో రవితేజ మల్టీప్లేక్స్ ఏర్పాటు చేయనున్నారని అంటున్నారు. ఇప్పటుకే ఏషియన్ గ్రూప్ తో కలిసి మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు మల్టీ ప్లెక్స్ బిజినెస్ లో ఉన్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు రవితేజ కూడా ఇదే బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారని తెలుస్తుంది. ఇక రవితేజ సినిమాల విషయానికొస్తే  ఇటీవలే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ రవితేజకు సాలిడ్ హిట్ మాత్రం దక్కడం లేదు. ఈగల్ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు రవితేజ.

రవితేజ ట్విట్టర్ పోస్ట్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.