Maruthi : మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ సినిమా.. హీరోయిన్ గా నటించనున్న అందాల భామ
టాలీవుడ్ లో టాలెంటెడ్ దర్శకుల్లో మారుతి ఒకరు. నాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాతో దర్శకుడిగా మంచి పేరును సొంతం చేసుకున్నాడు మారుతి.
Maruthi :
టాలీవుడ్ లో టాలెంటెడ్ దర్శకుల్లో మారుతి ఒకరు. నాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాతో దర్శకుడిగా మంచి పేరును సొంతం చేసుకున్నాడు మారుతి. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. కామెడీ ప్రధానాంశం గా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో మారుతి సినిమాలను రూపొందిస్తున్నాడు. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ తో ప్రతిరోజు పండగ అనే సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతోపాటు ఓ చిన్న సినిమాను కూడా మారుతి ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో హీరోగా సంతోష్ శోభన్ నటిస్తున్నాడు. తాను నేను , పేపర్ బాయ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్. ఇటీవల ఏక్ మినీ కథ సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు. సంతోష్ తో మారుతి చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా అందాల భామ మెహరీన్ ఎంపిక అయ్యిందని తెలుస్తుంది.
తెలుగులో మెహ్రీన్ చేసిన సినిమాల్లో ‘ఎఫ్ 2’ .. ‘మహానుభావుడు’ సినిమాలు ఆమెకి మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ సినిమాను చేస్తోంది. అంతే కాదు త్వరలోనే ఈ అమ్మడు పెళ్లిపీటలు కూడా ఎక్కనుంది. కరోనా కారణంగా మెహరీన్ పెళ్లి వాయిదా పడింది. గతంలో తనకి ‘మహానుభావుడు’ వంటి హిట్ ఇచ్చిన కారణంగా మెహ్రీన్ అంగీకరించిందని చెబుతున్నారు. హైదరాబాద్ .. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగు జరుగుతోందని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :