Janhvi Kushi: శ్రీదేవి కూతురు టాలీవుడ్ సినిమాపై బాలీవుడ్ లో చర్చ.. త్వరలోనే తెలుగు తెరపై కనిపించనుందంటూ వార్తలు ..

సౌత్ నుంచి వెళ్లి నార్త్ ఇండస్ట్రీని ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి. అందుకే ఆమె వారసురాలిగా జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి సౌత్ సినిమా..

Janhvi Kushi: శ్రీదేవి కూతురు టాలీవుడ్ సినిమాపై బాలీవుడ్ లో చర్చ.. త్వరలోనే తెలుగు తెరపై కనిపించనుందంటూ వార్తలు ..
Janhvi Kapoor(File Photo)
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 09, 2021 | 3:17 PM

Janhvi Kushi: సౌత్ నుంచి వెళ్లి నార్త్ ఇండస్ట్రీని ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి. అందుకే ఆమె వారసురాలిగా జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి సౌత్ సినిమా ఎప్పుడు చేస్తారన్న చర్చ జరుగుతూనే ఉంది. జాన్వీ కూడా సౌత్ ఇండస్ట్రీ మీద ఇంట్రస్ట్ చూపిస్తున్నా సరైన సబ్జెక్ట్ సెట్ కాకపోవటంతో డీలే అవుతూ వస్తోంది. అయితే ఇప్పుడు అక్కకు పోటి ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ఖుషీ కపూర్‌. త్వరలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్నా ఖుషీ… తన అరంగేట్రానికి సౌత్ ఇండస్ట్రీనే పర్ఫెక్ట్ అని ఫీలవుతున్నారట. ఇప్పటికే కథలు కూడా వింటున్న ఈ బ్యూటీ.. అన్ని సెట్ అయితే ఈ ఏడాదిలోనూ సౌత్ సినిమాతో ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. జాన్వీ సౌత్ సినిమా గురించి కూడా గట్టిగానే చర్చ జరుగుతోంది. స్టార్ హీరో సినిమాతో జాన్వీని సౌత్‌కు పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నారు బోని కపూర్‌. ఇక జాన్వీ కోసం టాలీవుడ్ దర్శకులు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది.

ఈ మధ్య ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లు వినిపించినప్పటికీ వాటిపై క్లారిటీ రాలేదు. ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ వారు ఎన్టీఆర్‌ మరియు ప్రశాంత్ నీల్‌ మూవీ కోసం ఆమెను సంప్రదించారంటూ వార్తలు వచ్చాయి. కాని ఆ విషయమై కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు.కాని బాలీవుడ్‌ మీడియాలో మాత్రం జాన్వీ తెలుగు మూవీకి ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సౌత్‌లో నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్న బోనీ… కూతురి కెరీర్‌కు బూస్ట్‌ ఇచ్చే కాంబినేషన్‌ను త్వరలోనే సెట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ అక్క చెల్లెల్లో ఎవరు ముందు సౌత్ ఎంట్రీ ఇస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

The Family Man 2: ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ పై ముదురుతున్న వివాదం.. సిరీస్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసిన సీనియర్ డైరెక్టర్

Prudhvi Raj: శ్రీహరి మంచితనాన్ని.. గుప్తదానాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న కమెడియన్ పృథ్వి