Prudhvi Raj: శ్రీహరి మంచితనాన్ని.. గుప్తదానాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న కమెడియన్ పృథ్వి

Prudhvi Raj: ప్రతి జీవికి మరణం తధ్యం.. కొంతమంది చిన్న వయసులోనే మరణిస్తే.. మరికొందరు జీవిత చరమాంకం వరకూ ఉండి .. అప్పుడు మృత్యుఒడిలోకి..

Prudhvi Raj: శ్రీహరి మంచితనాన్ని.. గుప్తదానాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న కమెడియన్ పృథ్వి
Sriharti
Follow us
Surya Kala

|

Updated on: Jun 09, 2021 | 3:00 PM

Prudhvi Raj: ప్రతి జీవికి మరణం తధ్యం.. కొంతమంది చిన్న వయసులోనే మరణిస్తే.. మరికొందరు జీవిత చరమాంకం వరకూ ఉండి .. అప్పుడు మృత్యుఒడిలోకి చేరుకుంటారు. అయితే కొంతమంది మరణించీ చిరంజీవులుగా ప్రజల మనస్సులో ఉంటారు. అటువంటి వారిలో ఒకరు దివంగత నటుడు శ్రీహరి.

క్రీడాకారుడు నుంచి వెండి తెరపై అడుగు పెట్టి.. చిన్న చిన్న పాత్రల స్థాయి నుంచి హీరోగాస్వయం కృషితో ఎదిగిన వ్యక్తి శ్రీహరి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్, అన్న, హీరో ఇలా పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించే నటుడు శ్రీహరి. కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఓ మంచి నటుడ్ని కోల్పోయింది. తాజాగా శ్రీహరి క్యారెక్టర్ గురించి ప్రముఖ కమెడియన్ పృథ్విరాజ్ అనేక విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. రోడ్ నెం.45లో ఉన్న శ్రీహరి గారి ఇంటి ముందుకు ఎవరైనా సహాయం కోసం వెళ్తే.. రాళ్లకు డబ్బులు చుట్టి.. దానికి గుడ్డ కట్టి బయటకు విసిరేసేవాడు. వాటిని తీసుకున్న వాళ్లు ఆయనకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టేవారు. ఈ విధంగా శ్రీహరి ఏదో ఒక రూపంలో కొన్ని వేల మందికి సహాయం చేశారు అంటూ ఆయన గొప్పతనం గురించి వివరించారు పృథ్విరాజ్.

శ్రీహరి తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని పృథ్విరాజ్ఎమోషన్ అయ్యారు. 1987లో బ్రహ్మనాయుడు సినిమాతో శ్రీహరి వెండి తెరపై అడుగు పెట్టారు. దాదాపు పాతికేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో చిత్రాలు, మరెన్నో పాత్రలు.. ఆయనకు పేరుతో పాటు అవార్డులనూ తెచ్చిపెట్టాయి. హీరోగా నటిస్తున్న సమయంలోనే ప్రముఖ నటి, డ్యాన్సర్‌ డిస్కో శాంతిని శ్రీహరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఈ దంపతులకు ముగ్గురు సంతానం. అయితే పాప చిన్నప్పుడే చనిపోయింది. కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీహరికి 2013లో లివర్‌కి సంబంధించిన సమస్యలతో కన్నుమూశారు. శ్రీహరి తన సుదీర్ఘ కెరీర్‌లో ఎంతో మందికి సహాయం చేశారు. శ్రీహరి చేసిన గుప్తదానాలకు లెక్కేలేదని ఆయనతో అనుబంధం ఉన్నవారు అప్పుడప్పుడు చెబుతుంటారు.

Also Read: స్త్రీలలో మెనోపాజ్ దశలో కలిగే లక్షణాలు.. నివారణకు సహజమార్గాలు..