Samantha Akkineni : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ కోసం సమంత, మనోజ్ బాజ్ పేయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Samantha Akkineni : 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై భారీ మొత్తంలో హైప్‌ను సృష్టించింది. ఈ వెబ్

Samantha Akkineni : 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' కోసం సమంత, మనోజ్ బాజ్ పేయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
The Family Man 2
Follow us
uppula Raju

|

Updated on: Jun 09, 2021 | 3:48 PM

Samantha Akkineni : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై భారీ మొత్తంలో హైప్‌ను సృష్టించింది. ఈ వెబ్ సిరీస్‌ను చూసిన చాలా మంది దీనిని అభినందిస్తున్నారు. నటి సమంతా అక్కినేని, మనోజ్ బాజ్‌పేయి నటన అందరి ప్రశంసలు అందుకుంది. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం నటీనటులు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలిస్తే అందరు ఆశ్చర్యపోతారు. మొత్తం వెబ్ సిరీస్‌లో హైలైట్ చేయబడినది మనోజ్ బాజ్‌పేయి ఆయన పోషించిన శ్రీకాంత్ తివారీ పాత్ర వెబ్ సిరీస్‌ను మొదటి నుంచి చివరి వరకు కవర్ చేస్తుంది. మనోజ్ తెరపై చాలా బాగా నటించాడు. అందువల్ల అతడికి ఈ వెబ్ సిరీస్ కోసం అత్యధికంగా చెల్లించారు. రెండు వెబ్ సిరీస్‌లకు మనోజ్‌కి రూ.10 కోట్ల వరకు చెల్లించినట్లు సినీ వర్గాల సమాచారం.

అలాగే ఈ వెబ్ సిరీస్ ద్వారా ఇప్పుడు సమంతా హాట్ టాఫిక్‌గా మారింది. ఆమె పోషించే రాజీ పాత్రను అందరూ అభినందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం ఆమెకు రూ.3-4 కోట్లు చెల్లించినట్లు సమాచారం. సమంతా నటన చూసిన చాలా మంది అభిమానులు ఆమెకు తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని అంటున్నారట. శ్రీకాంత్ తివారీ భార్యగా కనిపించే ప్రియమణి (సుచిత్రా)కి రూ .80 లక్షలు చెల్లించారని సమాచారం. షరీఫ్ హష్మి (సాజిద్) కు రూ.65 లక్షలు చెల్లించారట. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ జూన్ 3న సాయంత్రం ప్రసారం చేయబడింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఎంతో ప్రశంసలు అందుకుంది. మొదటి సిరీస్‌ను విజయవంతం చేసిన దర్శకుడు రాజ్, రెండో సిరీస్ ను కూడా విజయవంతం చేశారు. సీజన్ 3 ను కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

AP CM Jagan Delhi Tour: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖరారు.. అమిత్ షాతో ప్రత్యేక భేటీ..

Janhvi Kushi: శ్రీదేవి కూతురు టాలీవుడ్ సినిమాపై బాలీవుడ్ లో చర్చ.. త్వరలోనే తెలుగు తెరపై కనిపించనుందంటూ వార్తలు ..

Corona-Hair Fall: కోవిడ్ ఎఫెక్ట్.. ఆరు నెలలైనా తగ్గని జుట్టురాలే సమస్య.. వెంట్రుకలు పెరగడానికి వీటిని రోజు తీసుకోండి