Manchu Vishnu: ‘చంద్రబాబు గారు బంధువు.. జగన్ బావగారు’.. దయచేసి అలా లాగకండి
'మా' అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రకాష్‌రాజ్ ప్యానల్ ఎప్పుడో డిసైడ్ అవగా.. తాజాగా తన టీమ్‌ను పరిచయం చేసి, మేనిఫోస్టో ప్రకటించారు మంచు విష్ణు.
‘మా’ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రకాష్‌రాజ్ ప్యానల్ ఎప్పుడో డిసైడ్ అవగా.. తాజాగా తన టీమ్‌ను పరిచయం చేసి, మేనిఫోస్టో ప్రకటించారు మంచు విష్ణు. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘మా’లో మార్పు తీసుకొస్తానని, ప్రతి ఒక్కరికి మెడికల్ ఇన్సురెన్స్ కల్పిస్తాం అని విష్ణు చెప్పారు. ‘మా’ ఎన్నికల్లో ఎప్పుడూ ఇంత పోటీ ఎప్పుడూ చూడలేదని, ‘మా’ మెంబర్స్ గ్రూపులుగా విడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తీరుపై ఎవరూ హ్యాపీగా లేరని, ఎన్నికల గురించి మీడియా, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావడం బాధాకరమన్నారు. ఇక తన ప్యానల్‌లో మహిళలకు పెద్ద పీట వేస్తున్నట్లు మంచు విష్ణు తెలిపారు. ఈసారి ఎన్నికలు ఇబ్బందికరంగా ఉన్నాయని.. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. చివరివరకు ఏకగ్రీవం కోసం ట్రై చేశానని విష్ణు అన్నారు. పెద్దలకు సెక్యూరిటీ ఇవ్వటమే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ‘మా’ బిల్డింగ్ తన సొంత డబ్బులతో కడతానని చెప్పిన విష్ణు.. అందులో మల్టీప్లెక్స్, కళ్యాణ మండపం కట్టనని తేల్చి చెప్పారు. ‘మా’ లో ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్రవేట్‌గా మాట్లాడుకుందామని పిలుపునిచ్చారు. తాను పదవి లో ఉన్నా లేకపోయినా సినిమా ఇండస్ట్రీ కోసం చివరి శ్వాస వరకు పని చేస్తానని స్పష్టం చేశారు.
‘బాబు మోహన్ అంకుల్ బీజేపీ, మాదాల రవి కమ్యూనిస్ట్ పార్టీ… ఇంకా టీఆర్ఎస్, టీడీపీ వాళ్లు కూడా ఉన్నారు. మాకు చంద్రబాబు గారు బంధువు. వైఎస్ జగన్ బావగారు అవుతారు. కేటీఆర్ మంచి ఫ్రెండ్.. అన్ని పార్టీల వారూ మా ప్యానెల్‌లో ఉన్నారు. దండం పెడుతున్నాను.. పొలిటికల్ పార్టీలను ఇందులోకి లాగకండి.. ఏ పార్టీని అయినా ఎన్నుకునే స్వేచ్చ ఉంది.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు.. రాజకీయ పార్టీలకు సంబంధం లేదు’ అని విష్ణు అన్నారు.
ఆ వివరాలు దిగువన వీడియోలో చూడండి.
మంచు విష్ణు 26 మందితో తన ప్యానల్ ప్రకటించారు. మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. జనరల్ సెక్రటరీగా రఘుబాబు పోటీ చేస్తారు. వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, పృధ్వీరాజ్ బరిలో నిలుస్తున్నారు. ఇక ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబుమోహన్ పోటీ ఉన్నారు. ట్రెజరర్‌గా శివబాలాజీ, జాయింట్ సెక్రటరీగా కరాటే కల్యాణి, గౌతమ్‌రాజు పోటీ చేస్తున్నారు.
మంచు విష్ణు ప్యానెల్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా 18 మంది పోటీ చేయనున్నారు. హీరోయిన్ అర్చన, అశోక్‌కుమార్, గీతాసింగ్, హరినాధ్‌బాబు, జయంతి, మలక్‌పేట శైలజ, మాణిక్ పోటీకి దిగుతున్నారు. నటి పూజిత, రాజేశ్వరిరెడ్డి, హీరోయిన్ రేఖ, సంపూర్ణేష్‌బాబు, శశాంక్, శివనారాయణ, శ్రీలక్ష్మి ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పోటీ చేస్తున్నారు. శ్రీనివాసులు, స్వప్నమాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల బరిలో ఉన్నారు. మొత్తం విష్ణు ప్యానెల్‌లో 26 మంది పేర్లను గురువారం ప్రకటించారు. కాగా అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
Also Read: ‘‘మణికే మాగే హితే’’, ‘రౌడీ బేబీ’.. ఈ 2 బ్లాక్‌బాస్టర్ సాంగ్స్ మాషప్.. నెక్ట్స్ లెవల్ అంతే