Kannappa Movie: ఆ పని చేస్తే రూ.5 లక్షలు ఇస్తాం.. ప్రభాస్ లుక్ లీక్ పై కన్నప్ప టీమ్ రియాక్షన్..
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న చిత్రాల్లో కన్నప్ప ఒకటి. డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా ఇది. మోహన్ బాబు నిర్మిస్తుండగా.. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయ్యింది.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప. మహాభారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తుందిస్తున్నారు. ఇందులో ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మోహన్ బాబులతోపాటు మరికొంతమంది స్టార్స్ నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. అలాగే ఈ చిత్రంలో మంచు విష్ణు వారసుడు సైతం నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి తాజాగా ప్రభాస్ లుక్ లీక్ అయ్యింది. క్షణాల్లోనే డార్లింగ్ ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది. దీంతో తాజాగా కన్నప్ప టీమ్ స్పందించింది.
కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ లుక్ లీక్ చేసిన వారిని కనిపెడితే రూ.5 లక్షల బహుమానం ఇస్తామని తెలిపింది. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేసింది. ‘ప్రభాస్ అభిమానులతోపాటు, మిగిలిన హీరోల ఫ్యాన్స్ కోరుతున్నది ఏమంటే కన్నప్ప కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా మేము మా ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నాం. రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కన్నప్ప నుంచి ఓ ఫోటో అనధికారికంగా లీక్ అయినందుకు బాధపడుతున్నాం. ఈ లీక్ మా కష్టాన్ని మాత్రమే కాదు.. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతిక్షణం కృషి చేస్తున్న 2 వేలమంది వీఎఫ్ఎక్స్ కళాకారుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ ఫోటో లీక్ ఎలా అయ్యిందనేది తెలుసుకోవడానికి మేము పోలీస్ కేసు పెట్టాము. దయచేసి ఈ ఫోటోను ఎవరూ షేర్ చేయొద్దని మనవి. దీనిని షేర్ చేసిన వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ ఫోటోను లీక్ చేసిన వారిని కనిపెట్టినవారికి రూ.5 లక్షల బహుమానం అందిస్తాం. మీరందరూ మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు’ అంటూ ఆ లేఖలో రాసి ఉంది.
కన్నప్ప సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సొంత నిర్మాణ సంస్థపై మోహన్ బాబు నిర్మిస్తుండగా.. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తుంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ లాల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఇందులో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తుండగా.. నంది పాత్రలో ప్రభాస్ కనిపించనున్నట్లు సమాచారం.
An Urgent and Heartfelt Appeal from the Kannappa Team 🙏కన్నప్ప టీమ్ నుంచి అత్యవసర, హృదయపూర్వక విజ్ఞప్తి 🙏 pic.twitter.com/Flx6mbchJR
— 24 Frames Factory (@24FramesFactory) November 9, 2024
ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్ను చూశారా..?
Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..
Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.