దేశముదురు భామ సోషల్ మీడియాతోనే బిజీ బిజీగా గడుపుతుందే.. 

28 January 2025

Rajeev 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక మోత్వాని.

తొలి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. అంతకు ముందు బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఈ భామ.

దేశముదురు సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.

టాలీవుడ్ లో యంగ్ హీరోలందరితో కలిసి నటించింది హన్సిక. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది.

ఇటీవలే పెళ్లిపీటలెక్కింది ఈ బ్యూటీ .పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది హన్సిక. కానీ సోషల్ మీడియాలో అదరగొడుతోంది ఈ చిన్నది.

తాజాగా తన గ్లామరస్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాగే టీవీ షోల్లో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తోంది హన్సిక.

రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది హన్సిక. ఈ అమ్మడి ఫోటోలకు నెట్టింట మంచి క్రేజ్ ఉంది.