Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumbh Mela: కుంభమేళాలో అందాల మీదే కెమెరా కళ్లు.. ఇలా తయారయ్యారేంట్రా?

Rajeev Rayala

|

Updated on: Jan 28, 2025 | 8:37 PM

మహా కుంభమేళా...! ఇదో పరమ పవిత్రమైన వేడుక. భారతీయులందరూ కలిసి కట్టుగా.. గంగా నదిలో పుణ్యస్నానాలాచరించే వేడుక. భారతదేశానికి ఎంతో గర్వకారణమైనదిగా గుర్తింపు పొందినది ఈ వేడుక. అలాంటి ఈ వేడుక ఇప్పుడు అపహాస్యంగా మారుతోంది. దొంగ బాబాలు.. బాబాల వేషంలో దొంగ చేష్టలు.. కెమెరాలు వేసుకుని అమ్మాయిల అందాన్ని రికార్డ్ చేయడాలు.. నెట్టింట వైరల్ చేసి క్యాష్ చేసుకోడాలు..! పూర్తిగా కాకపోయినా ఇది కూడా జరుగుతోంది!.. ఇది కూడా కనిపిస్తోంది ..!

12 సంవత్సరాల తర్వాత ప్రయాగ రాజ్‌లో అత్యంత వైభవంగా ఈ మహా మేళా జరగుతుంటే.. ప్రపంచం మొత్తం కళ్లప్పగించి మరీ మన వేడుక వైపే చూస్తుంటే..! కొంత మంది మాత్రం ఏం చేస్తున్నారు.? మోనాలిసా అనే అమ్మాయి వెంట పడుతున్నారు? అత్యంత రద్దీగా ఉన్న ప్రయాగ్‌లో జల్లడపట్టి మరీ ఆమెనే వెతుకుతున్నారు. ఆమె అందంపై కామెంట్లు చేస్తున్నారు. పిచ్చిగా.. పచ్చిగా… ఆమె పేరుతో వీడియోలు చేసి.. క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే.. వేలం వెర్రితో బరితెగిస్తున్నారు.

ఇండియాలో సోషల్ మీడియా కల్చర్ పెరిగింది. ఒప్పుకోవాల్సిందే! అదో ఇన్‌కమ్‌ జనరేట్ చేసే టూల్‌గా మారింది నిజమే అంటాం! కానీ వ్యూస్ అండ్ లైక్స్ చక్కర్లో ఓ అమ్మాయి జీవితంపై ఎందుకు అంతగా, అతిగా ఫోకస్ చేయాలి? అందంగా ఉందని ఆమె ప్రైవేసీని డిస్ట్రబ్ చేయడం ఏంటి? ఆమె అనుమతి లేకుండా.. వెంట పడి మరీ ఫోటోలు వీడియోలు తీయడాలు.. వైరల్ చేయడాలు ఏంటి?

కుంభమేళాలో ఓ యూట్యూబర్‌కు అనుకోకుండా తారసపడింది ఈ పూసలమ్ముకునే అమ్మాయి. పేరు మోనాలిసా..! మధ్యప్రదేశ్‌ ఇండోర్ కు చెందిన అమ్మాయి. కుంభమేళాలో పూసల వ్యాపార నిమిత్తం తన ఫ్యామిలీతో వచ్చింది. చూడ్డానికి అందంగా.. ఆకట్టుకునేలా ఉంటుంది. పిల్లి కళ్లతో.. నిండైన నవ్వుతో చూడముచ్చటగా కనిపిస్తుంది. కళ్లల్లో అమాయకత్వం.. మాటల్లో తెలియనితనం.. కలబోతగా ఉండే ఈమె.. తన మాటలతో నవ్వు తెప్పిస్తుంది. తెలియకుండా ఇంప్రెస్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా ఇలా ఫీలయ్యాడో ఏమో కానీ.. ఓ యూట్యూబర్‌ ఈ అమ్మాయితో నాలుగు మాటలు మాట్లాడి ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఓ నాలుగు ఫోటోలను తీసి.. ఫోటో షాప్‌లో మరింత డైనమిక్ గా మార్చి నెట్టింట వదిలాడు. అంతే మోనాలిసా కాస్తా నెట్టింట వైరల్ బ్యూటీ అయిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.