- Telugu News Photo Gallery Cinema photos Heroine Ananya Nagalla shared latest mesmerizing photos in saree goes viral in internet
Ananya Nagalla: చందమామ ఈ సుకుమారిని తన గుండెల్లో మలచుకుంది.. మెస్మరైజ్ అనన్య..
అనన్య నాగల్ల..ఈమె పేరు తెలియాని తెలుగు ప్రేక్షకులు ఉండరు. 2019 చిత్రం మల్లేశంతో అరంగేట్రం చేసి ప్లే బ్యాక్, వకీల్ సాబ్ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. తెలుగు వరస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది. హీరోయిన్గా మాత్రమే కాకుండా సహాయ పాత్రల్లో నటించి మెప్పిస్తుంది. తాజాగా ఈ సుకుమారి సోషల్ మీడియా షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Updated on: Jan 28, 2025 | 8:03 PM

8 జనవరి 1996న తెలంగాణలో సత్తుపల్లిలో జన్మించింది వయ్యారి భామ అనన్య నాగళ్ల. ఆమె తండ్రి పేరు వెంకటేశ్వర రావు, తల్లి పేరు విష్ణు ప్రియా. ఇబ్రహీంపట్నంలోని రాజ మహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో తన బి. టెక్ పూర్తి చేసి ఇన్ఫోసిస్‌లో జాబ్ చేసింది ఈ బ్యూటీ.

2019లో ప్రియాదర్శికి జోడిగా మల్లేశం అనే ఓ తెలుగు బయోపిక్ చిత్రంలో కథానాయకిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. తర్వాత 2021లో ప్లే బ్యాక్ అనే ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది ఈ అందాల భామ.

2021లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో దివ్య అనే ముఖ్య పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. తరువాత యంగ్ హీరో నితిన్, నభా నటేష్ జంటగా తెరకెక్కిన మాస్ట్రో అనే సినిమా పవిత్రగా నటించింది ఈ వయ్యారి.

2023లో సమంత ప్రధాన పాత్రలో చేసిన శాకుంతలంలో అనసూయగా ఆకట్టుకుంది. అదే ఏడాది మళ్లీ పెళ్లి, అన్వేషి చిత్రాల్లో కనిపించింది. 2024లో తంత్ర అనే తెలుగు హార్రర్ థ్రిల్లర్‌తో పాటు డార్లింగ్ వై దిస్ కలవారి సినిమాల్లో కనిపించింది. అదే ఏడాది పొట్టెల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది.

షాది అనే ఓ షార్ట్ ఫిల్మ్‌లో ప్రధాన పాత్రలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో ఆమె నటనకి SIIMA షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా ఎంపికైంది. 2024లో జి5లో ప్రసారం అయినా బహిష్కరణ అనే వెబ్‌సిరీస్‌లో ముఖ్య పాత్రలో కనిపించింది.




