Manchu Vishnu: ఇది హార్ట్ బ్రేకింగ్.. ప్లీజ్ అలా చేయకండి.. మంచు విష్ణు..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సినిమాల్లో కన్నప్ప ఒకటి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుంది. తెలుగుతోపాటు ఇతర భాషలలోనూ ఈ చిత్రానికి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మంచు విష్ణు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది.

Manchu Vishnu: ఇది హార్ట్ బ్రేకింగ్.. ప్లీజ్ అలా చేయకండి.. మంచు విష్ణు..
Manchu Vishnu

Updated on: Jun 30, 2025 | 12:58 PM

భారీ బడ్జెట్… భారీ తారాగణంతో మోహన్ బాబు నిర్మించిన పీరియాడికల్ డ్రామా కన్నప్ప. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోస్ కీలకపాత్రలు పోషించడడంతో ముందు నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేయి కళ్లతో ఎదురుచూశారు ఫ్యాన్స్. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజు నుంచే భారీ వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. తెలుగులో మ్యాట్నీ, సాయంత్రం షోస్ హోస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి మంచు విష్ణు తన సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. కన్నప్ప సినిమా పైరసీకి గురవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి సినిమాను నిర్మించామని.. ఎవరూ పైరసీని ప్రొత్సహించవద్దంటూ రిక్వెస్ట్ చేశారు. ే

“కన్నప్ప సినిమాపై పైరసీ దాడి జరిగింది. ఇప్పటికే 30వేలకు పైగా అక్రమ లింక్స్ తొలగించాము. ఇది చాలా బాధకరంగా ఉంది. పైరసీ అంటే దొంగతనం చేయడం.. ఇలాంటి చర్య దొంగతనంతో సమానం అవుతుంది. మన ఇంట్లో పిల్లలకు మనం దొంగతనం చేయమని మనం నేర్పించం.. ఇలా ఒక సినిమాను పైరసీలో చూడడం కూడా దొంగతనంతో సమానమే అవుతుంది. దయచేసి ఇలాంటి వాటిని అరికట్టండి. మా కన్నప్ప సినిమాను ఆదరించండి ” అంటూ విష్ణు రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. కన్నప్ప సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.58 కోట్లు సాధించినట్లు సమాచారం. మొదటి రోజే పాజిటివ్ టాక్ సంపాదిచుకున్న ఈసినిమాకు రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. అలాగే ఇందులో ప్రభాస్, విష్ణు యాక్టింగ్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ విమర్శకులు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..