Mohan Babu: టీవీ9కు మోహన్ బాబు క్షమాపణలు..

మీడియాపై దాడి ఘటనలో టీవీ9కు నటుడు మోహన్ బాబు క్షమాపణలు తెలిపారు. 'నా కుటుంబ ఘటన ఇలా పెద్దదిగా మారి టీవీ9ను, జర్నలిస్టులను ఆవేదనకు గురిచేసినందుకు చింతిస్తున్నాను.

Mohan Babu: టీవీ9కు మోహన్ బాబు క్షమాపణలు..
Mohan Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 13, 2024 | 9:14 AM

మీడియాపై దాడి ఘటనలో టీవీ9కు నటుడు మోహన్ బాబు క్షమాపణలు తెలిపారు. ‘నా కుటుంబ ఘటన ఇలా పెద్దదిగా మారి టీవీ9ను, జర్నలిస్టులను ఆవేదనకు గురిచేసినందుకు చింతిస్తున్నాను. ఘటన అనతరం 48 గంటలపాటు ఆసుపత్రిపాలు కావడం వల్ల నేను స్పందించలేకపోయాను. ఆరోజు ఆవేశంలో జరిగిన ఘటనలో జర్నలిస్టు గాయపడడం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి, టీవీ9 ఫ్యామిలీకి మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.

మోహన్ బాబు ఫ్యామిలీలో గత కొంతకాలంగా నెలకొన్న విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి హైదరాబాద్ జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. అదే సమయంలో టీవీ9 రిపోర్టర్ రంజిత్ చేతిలోని మైక్ లాక్కొని అతడిని బలంగా కొట్టారు. ఈ ఘటనలో టీవీ9 రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. రిపోర్టర్ పై దాడి ఘటనపై జర్నలిస్ట్ సంఘాలు భగ్గుమన్నాయి.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.