Manchu Manoj: నాన్న నువ్వు నా ప్రాణం.. తండ్రి మోహన్ బాబుపై మనోజ్ స్పెషల్ వీడియో..
ఎన్నో రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో రగులుతున్న విభేదాలు ఇప్పుడు రోడ్డుకెక్కాయి. గత మూడు రోజులుగా హైదరాబాద్ జల్ పల్లిలోని మోహన్ బాబు ఫాంహౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. కొడుకు మనోజ్ పై మోహన్ బాబు దాడి చేశారనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.
మంచు ఫ్యామిలీలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకూ చేరాయి. గత మూడు రోజులుగా మోహన్ బాబు ఇంట్లో గొడవలు తారాస్థాయికి చేరాయి. మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మంచో మనోజ్, అతడి భార్య మౌనికపై కేసు నమోదు చేశారు. మంగళవారం మరోసారి మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే పరిస్థితిని కవరేజీ చేయడానికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు విచక్షణ రహితంగా దాడి చేశారు. టీవీ9 ప్రతినిధి రంజిత్ చేతిలోని మైక్ లాక్కొని అతడిపై బలంగా దాడి చేశాడు. ఈ ఘటనలో రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు.
ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబు, విష్ణు, మంచు మనోజ్ కు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. 126 బిఎన్ఎస్ ప్రకారం జిల్లా అదనపు మేజిస్ట్రేట్ హోదాలో నోటీసులు ఇవ్వడంతో బుధవారం మంచు విష్ణు, మనోజ్ వేర్వేరుగా పోలీస్ కమిషనరేట్ లో అదనపు మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న సుధీర్ బాబు ముందు హాజరయ్యి వాంగ్మూలం ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో మంచు మనోజ్ చేసిన ఓ పాత వీడియో వైరలవుతుంది. గతంలో తన తండ్రి మోహన్ బాబు అంటే ఎంత ప్రేమనో చెబుతూ అతడు క్రియేట్ చేసిన వీడియో ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా యానిమల్ సినిమాలోని నాన్న నువ్వు నా ప్రాణం అంటూ వచ్చే పాటపై మనోజ్ ఈ వీడియోను రూపొందించారు. వీడియోలో తన తండ్రితో తాను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కలిసి నటించిన చిత్రాల ఫుటేజీని.. తండ్రితో కలిసి దిగిన ఫోటోలను పొందుపరిచారు. సాంగ్ లిరిక్స్ కు మ్యాచ్ అయ్యేలా ఆ వీడియోను బాగా క్రియేట్ చేశారు. “జీవితంలో నువ్వు నేర్పిన పాఠాలకు.. నా జీవితానికి ధన్యవాదాలు.. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Happy Birthday Nanna, Thank you for the Lessons, Laugh & Life.
— Yours always, Manu. pic.twitter.com/R9DOdnrVed
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 20, 2024
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.