ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగం దగ్గర టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

11 December 2024

Basha Shek

ప్రపంచలో ఎన్నో శైవ క్షేత్రాలున్నాయి. అయితే అరుణాచల్ ప్రదేశ్‌లోని  కర్దో జిరో అనే ప్రాంతలో ఉండే ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది.

 ఇందులో సహజ సిద్ధంగా రాతితో ఏర్పడిన శివలింగం ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దయిన శివలింగంగా గుర్తింపు ఉంది.

తాజాగా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఈ ప్రపంచంలోనే ఎత్తయిన శివలింగాన్ని దర్శించుకుని మురిసిపోయింది.

అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుందీ అందా తార.

కాగా మంగళూరుకు చెందిన  శ్రీనిధి శెట్టి  కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయింది .

అయితే దీని తర్వాత ఆమె పెద్దగా సినిమాల్లో నటించలేదు. విక్రమ్ కోబ్రా సినిమాలో మాత్రమే హీరోయిన్ గా కనిపించింది.

ఇప్పుడిప్పుడే ఈ ముద్దుగుమ్మకు తెలుగులోనూ వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.

హీరోయిన్ శ్రీనిధి శెట్టి ప్రస్తుతం సిద్ధూ జొన్నగల గడ్డ తెలుసు కదా, నాని హిట్ 3 సినిమాల్లో కథానాయికగా  నటిస్తుంది.