Manchu Manoj: రాచకొండ సిపి ముందు మంచు మనోజ్ బైండోవర్.. కమీషనర్ ఏమన్నారంటే
మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణతో పోలీసులు మంచు మోహన్ బాబుతో పాటు ఆయన కుమారులిద్దరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఉదయం 10.30 గంటలకు సీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. అయితే రాచకొండ సీపీ నోటీసులపై నిప్పులు చెరిగారు మంచు విష్ణు.
నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాద సందర్భంగా జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నమోదైన కేసుల విషయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు 126 బిఎన్ఎస్ ప్రకారం జిల్లా అదనపు మేజిస్ట్రేట్ హోదాలో నోటీస్ ఇచ్చారు. దీనికి స్పందిస్తూ మంచు మనోజ్ ఈ రోజు(బుధవారం) నేరేడ్ మెట్ లోని పోలీస్ కమిషనరేట్ లో అదనపు మెజిస్ట్రేట్ హోదాలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ముందు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి :10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు.. ఇప్పుడు ఒకొక్క సినిమాకు రూ. 20కోట్లు అందుకుంటుంది
వారి కుటుంబ వివాదాల నేపథ్యంలో జరిగిన గొడవకు సంబంధించి విషయాలలో మంచు మనోజ్ వాంగ్మూలం తీసుకున్నారు కమిషనర్. కుటుంబ వివాదాలను శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదని, ఇరు వర్గాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. వారి కుటుంబ వివాదాల నేపథ్యంలో వారి యొక్క చర్యలు సమాజంలోని ఇతర వ్యక్తులకు, ఆ చుట్టుపక్కల ప్రజల శాంతికి భంగం కలిగించే విధంగా ఉన్నట్లయితే చర్య తీసుకోవడం జరుగుతుందని మరోసారి గొడవలు జరిగితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించి సంయమనం పాటించాలని సూచించారు. కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మంచు మనోజ్ ఒక సంవత్సరం కాలం పాటు శాంతి కాపాడడానికి ఎలాంటి ప్రతికూల చర్యలకు దిగకుండా ప్రజాశాంతికి భంగం కలిగించకుండా ఉంటానని బాండ్ ఇవ్వడం జరిగింది.
ఇది కూడా చదవండి :కోట్లకొద్దీ ఆస్తులు.. లెక్కలెన్నని లగ్జరీ కార్లు.. అయినా ఆటోలో తిరుగుతున్న అందాల భామ..
ఇదే రోజు సాయంత్రం మోహన్ బాబు పెద్ద కుమారుడు అయిన మంచు విష్ణు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ ముందు హాజరయ్యారు. అనంతరం కమిషనర్ కి తన తరపు వాదనలు వినిపించి తనకు కోర్టు 24వ తేదీ వరకు ఇచ్చినటువంటి ఉత్తర్వుల గురించి తెలియజేశారు.. ఇట్టి వివాదంలో అక్కడ ఎలాంటి సమస్యలు సృష్టించవద్దు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదు అని కమీషనర్ తెలియజేసి, తర్వాత కోర్టు ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యల గురించి తెలియజేయడం జరుగుతుందని అప్పటివరకు శాంతి భద్రత ఎలాంటి విఘాతం కలిగించిన వారి మీద తగిన చర్యలు ఉంటాయని ఆదేశించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.