Hyderabad: తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్..

Hyderabad: తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Dec 12, 2024 | 9:12 AM

హైదరాబాద్‌లో ఫుడ్‌ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వరుసగా మెరుపు దాడులు చేస్తున్నారు. బేగంబజార్‌లోని ఆకాష్‌ ట్రేడింగ్‌ కంపెనీలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 60 టన్నుల కొబ్బరిపొడిని సీజ్ చేశారు అధికారులు. సీజ్‌ చేసిన కొబ్బరిపొడి విలువ 92 లక్షలు పనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా రూల్స్‌కి విరుద్ధంగా కోకోనట్‌ పౌడర్‌ను ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచినట్టు అధికారులు గుర్తించారు.

పలు బ్రాండ్ల పేరుతో కొబ్బరి పొడిని ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుర్తించారు అధికారులు. ఈ కోకోనట్‌ పౌడర్‌ శాంపిల్స్‌ ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఆకాష్‌ ట్రేడింగ్‌ కంపెనీకి నోటీసులు జారీ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. సీజ్‌ చేసిన కోకోనట్‌ పౌడర్‌ నాణ్యతను గుర్తించే పనిలో ఉన్నారు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు. ల్యాబ్‌ నుంచి రిపోర్ట్స్‌ వచ్చాక ఆకాష్‌ ట్రేడింగ్‌ కంపెనీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కల్తీ కొబ్బరిపొడి అనే అనుమానంతో ఫుడ్‌ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు చేశారు. అయితే రూల్స్‌కు విరుద్ధంగా ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తేలడంతో నోటీసులు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్‌ కోర్టుల్లో తనిఖీలు చేస్తున్నారు. కల్తీ పదార్థాలు, అపరిశుభ్రమైన వాతావరణంతో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు. కొన్నింటిని సీజ్‌ చేశారు. ఇక ఇప్పుడు ట్రేడింగ్‌ కంపెనీల్లోనూ తనిఖీలు నిర్వహిస్తుండటంతో నిర్వాహకుల్లో వణుకు మొదలైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.