ఆలోచన అదిరిందిపో.. కుక్కల నుంచి రక్షణకు వినూత్న ప్రయోగం !!

ఆలోచన అదిరిందిపో.. కుక్కల నుంచి రక్షణకు వినూత్న ప్రయోగం !!

Phani CH

|

Updated on: Dec 11, 2024 | 9:03 PM

ఎవరు చెప్పారో ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచన కానీ, వికారాబాద్‌లో మాత్రం విచిత్ర దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. వీధి కుక్కల బెడద నుంచి రక్షణకు అక్కడి స్థానికులు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. కుక్కలు ఇంటిపక్కకు రాకుండా .. పిల్లల వెంబడి పడకుండా ఉండేందుకు వినూత్న ప్రయోగానికి తెరలేపారు. అదేమి విచిత్రమో గానీ వారి ప్రయోగం సక్సెస్‌ అయిందని స్థానికులు సంబరపడిపోతున్నారు.

కలర్‌ నీళ్ల బాటిళ్లు ఇంటి ముందు వేలాడకట్టడమే ఆ వినూత్న ప్రయోగం. నీళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ కలర్ కలిపి గేటుకు వేళాడదీస్తున్నారు అక్కడి ప్రజలు. ప్రతీ ఇంటి ముందు ఓ కలర్ వాటర్ బాటిల్ కనపడుతుంది. అలా కట్టినప్పడి నుంచి కుక్కలు అటువైపుగా రావడం లేదంటున్నారు స్థానికులు. కలర్ వాటర్ బాటిల్ కట్టినప్పటి నుంచి వీధుల్లో కుక్కలు కనిపించడం లేదంటున్నారు. ఒకవేళ వచ్చినా ఒంటికీ రెంటికీ పోకుండా అక్కడి నుంచి జారుకుంటున్నాయని చెబుతున్నారు. ఫోన్లలో వీడియోలు చూసి ఇలా కుక్కల బారి నుంచి రక్షణకు కలర్ బాటిల్ కట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. రంగు సీసాలను చూసి పారిపోతాయని చెబుతున్నారు. బాటిల్ కట్టాం….కుక్కల బెడద నుంచి తప్పించుకున్నామంటున్నారు చిన్నారుల తల్లిదండ్రులు. అయితే కుక్కలు కలర్‌ బాటిల్స్‌ చూసి దగ్గరకు రావు అనేందుకు కచ్చితమైన శాస్త్రీయమైన ఆధారాలు మాత్రం లేవంటున్నారు నిపుణులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జలుబు, దగ్గు, గొంతునొప్పికి ఇంటి చిట్కాలు

‘పుష్ప-2’ పై ట్రోల్స్.. గట్టిగా బదులిచ్చిన జాన్వీ కపూర్ !!

గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుంటే క్రూరమృగాల తీసుకెళ్లింది !!

Capsicum: క్యాప్సికం తింటే ఇన్ని ప్రయోజనాలా ??

నెయిల్ పాలిష్‌ను ఇలా ఈజీగా రిమూవ్ చేయచ్చు