నెయిల్ పాలిష్‌ను ఇలా ఈజీగా రిమూవ్ చేయచ్చు
గోళ్లకు అందాన్ని తెచ్చేది నెయిల్ పాలిష్. ఇప్పుడు వీటిలో ఎన్నో రంగులు, రకాలు కూడా వచ్చాయి. తాము వేసుకున్న డ్రెస్‌ని బట్టి.. చాలా మంది గోళ్ల రంగును మార్చుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి గోళ్ల రంగును మార్చుకోవడానికి నెయిల్ రిమూవర్ అందుబాటులో ఉండదు. నెయిల్ రిమూవర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు.
అందుకే ఆల్టర్నేటివ్‌గా కొన్ని వంటింటి చిట్కాలు ఇందుకు హెల్ప్ చేస్తాయి. అవేంటంటే.. వెనిగర్, ఆరెంజ్ జ్యూస్‌ను ఉపయోగించి నెయిల్ పాలిష్‌ను రిమూవ్ చేసుకోవచ్చు. ఇవి నెయిల్ పాలిష్‌ను ఈజీగా రిమూవ్ చేస్తాయి. ఈ రెండింటిని కలిపిన మిశ్రమంలో దూదిని ముంచి.. గోళ్లపై అప్లై చేసి 10 సెకన్ల పాటు అలానే ఉంచండి. ఆ తర్వాత కాటన్‌తో తుడిచేస్తే ఈజీగా నెయిల్ పాలిష్ తొలగిపోతుంది. శానిటైజర్‌తో కూడా గోళ్ల రంగును తొలగించుకోవచ్చు. గోళ్లపై ముందుగా శానిటైజర్ రాసి.. కాసేపు అలానే వదిలేసి.. దూదితో క్లీన్ చేసుకోవచ్చు. అలాగే హెయిర్ స్ప్రేతో కూడా మనం ఈజీగా నెయిల్ పాలిష్‌ను తొలగించుకోవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్ !! ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ కనెక్షన్ అందుబాటులోకి
Published on: Dec 11, 2024 06:58 PM
వైరల్ వీడియోలు
Latest Videos